యోగికి భంగపాటు

ఉత్తర్ ప్రదేశ్ లోని రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి మింగుడుపడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదుచేసుకుని గద్దెనెక్కిన బీజేపీ సర్కారు ఈ స్థాయిలో ఎదురుదెబ్బను ఊహించలేదు. గోరఖ్ పూర్ బీజేపీకి కంచుకోట. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుండి ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తరువాత ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ జరిగిన ఉపఎన్నికను యోగీ అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. ఇక్కడ బీజేపీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థి ఎవరనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అన్నీతానై వ్యవహరించిన యోగి ఫలితాన్ని జీర్ణించుకోవడం కష్టమే.
దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కు పేరుంది. సంఘ్ పరివార్ లో గట్టిపట్టున యోగి హిందు అతివాద నాయకుడిగా దేశవ్యాప్తంగా గట్టిమద్దతుదారులను కూడగట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తర్ ప్రదేశ్ లో పరిపాలన మెరుగుపడిందని అన్నివర్గాల వారు బీజేపీ పాలనను మెచ్చుకుంటున్నారనే ప్రచారం విస్తృతంగా సాగింది. ముఖ్యమంగా సోషల్ మీడియాలో యోగిని హీరోని చేసేశారు. ఈ సమయంలో తాను స్వయంగా ప్రాతనిధ్యం వహించిన గోరఖ్ పూర్ స్థానాన్ని నిలెబట్టుకోలేకపోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అటు పుల్ పుర్ లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడా సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికే ఓటర్లు మద్దతుపలికారు. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ కుమార్ మౌర్య గతంలో ఈ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గతంలో ప్రాతినిధ్యం వహించిన లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఓటిమి పాలవడం బీజేపీ శ్రేణులను పూర్తిగా నిరాశలో ముంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీకి ఈ రెండు స్థానాల్లో ఓటమిపాలుకావడం శరాఘాతంగానే మారింది. గోరఖ్ పూర్ లో తొలుత బీజేపీకి ఆదిఖ్యాన్ని ప్రదర్శించినా ఆతరువాత క్రమంగా పరిస్థితి మారింది. క్రమంగా సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి మెజార్టీలోకి రావడంతో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీడియాను కౌంటిగ్ కేంద్రనుండి దూరంగా పంపేశారు. లోపలినుండి ఎటువంటి సమాచారం బయటకు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. దీనిపై మీడియాతో పాటుగా సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మొత్తం మీద యూపీ ఫలితాలు బీజేపీ పై గట్టి ప్రభావాన్ని చూపుతాయనడంలో సందేహం లేదు.
రాష్ట్రంలో దశాబ్దాలుగా ఉప్పు నిప్పుగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ లు కలిసి ఈ ఎన్నిక్లలో పోటీచేయడం బీజేపీని దెబ్బతీసినట్టుగానే కనిపిస్తోంది.
yogi, yogi adityanath, Samajwadi Party, Yogi Adityanath, Phulpu, Gorakhpur, Mayawat, alliance.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *