ఆఖరి చూపూ దక్కడం లేదు… యద్దనపూడి అభిమానుల ఆవేదన

తెలుగు నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి బౌతిక కాయానికి అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడంతో యద్దనపూడి అభిమానాలు ఆవేదన చెందుతున్నారు. ఆమె అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనేది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారం అనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ఆమెకు అభిమానులు ఉన్నారని వారికి ఆఖరి చూపు కూడా దక్కకపోవడం బాధాకరమని పలువురు అభిమానులు వాపోతున్నారు.
యద్దనపూడి సులోచనారాణి అమెరికాలో ఉంటున్న ఆమె ఏకైక కుమారై ఇంట్లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహించనున్నట్టు శైలజ స్పష్టం చేయడంతో ఆమెను కడసారి చూద్దామనుకున్న వారి ఆశలు తీరలేదు. అమెకు పెద్ద సంఖ్యలో బంధువర్గం అంతా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అమెరికాలోనూ కొంత మంది బంధువులు ఉన్నప్పటికీ చాలా మంది ఇక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ ఆమె కుటుంబ సభ్యుల నిర్ణయం ప్రకారం అమెరికాలోనే కాలిఫోర్నియాలోనే ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.
యద్దనపూడి సులోచనారాణి తన రచనల ద్వారా వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పాత తరంలో ఆమె పేరు తెలియని వారు ఆమె నవల లేని ఇల్లు లేదంటే అతిశయోక్తికాదు. అమె రాసిన ఆనేక నవలలు సినిమాలుగా వచ్చిన సంగతి తెలిసింది. యద్దనపూడిసోలోచనారాణి మరణ వార్త పట్ల తెలుగు సాహితీ లోకానికి చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు. తన రచనా శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ఎప్పుడు చురుగ్గా ఉండేవారని పలువురు గుర్తుకు తెచ్చుకున్నారు. ఆమె అంత్యక్రియలను నగరంలో నిర్వహించి ఉంటే బాగుండేదని అయితే వారి బంధువులు ఎందుకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారో తెలియనందున దాని గురించి మాట్లాడడం సమంజసం కాదన్నారు. వారు సహేతుక కారణంతోనే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని వారు పేర్కొన్నారు.
yaddanapudi sulochana rani, yaddanapudi, telugu novels, telugu writer, telugu writer yaddanapudi sulochana rani.

రచయిత్రి యద్దనపూడి పులోచనారాణి మృతి


రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీవీ యాంకర్ లోబో
యద్దనపూడి నవలలు