రచయిత్రి యద్దనపూడి పులోచనారాణి మృతి

ప్రముఖ తెలుగు రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్ముమూశారు. అమెరికాలో ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెళ్లడించారు. తెలుగులో అగ్రశ్రేణి కథ రయచిత్రీగా యద్దనపూడి సులోచనారాణి గుర్తింపు తెచ్చుకున్నారు. యద్దనపుడి రచనలు ముఖ్యంగా మహిళలను ఆకర్షించేవి. కుటుంబ కథా నవలలు రాయడంలో ఆమెకు ఆమెసాటి. ‘నవలా దేశపు రాణి’ గా ఆమె పేరు సంపాదించుకున్నారు.
కృష్ణా జిల్లాలో జన్మించిన ఆమె చిన్న తనం నుండే రచనలు చేయడం ప్రారంభించారు. ఆమె రచనల్లో మీనా అంత్యంత ప్రసిద్ది చెందింది. దీని ఆధారంగానే మీనా చలనచిత్రాన్ని నిర్మించారు. యద్దనపూడి రాసిన అనేక నవలలు సినిమాలుగా రూపుదిద్దుతున్నాయి. ఆమె రచనల్లో ఆహుతి,ఆగ్నిపూలు,ఆరాధన, ఆగమనం, రుతువులు నవ్వాయి, అమర హృదం ప్రేమ పీఠం, కలల కౌగిలి, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మౌనపోరాటం, మౌన భాష్యం, వెన్నెల్లో మల్లిక, విజేత, శ్వేతగులాబి, సెక్రటర నవలలు రాశారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో కూతురు దగ్గర ఉంటున్న యద్దనపూడి సులోచనారాణి కి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూసినట్టు కుటుంబసభ్యలు తెలిపారు.
yaddanapudi sulochana rani, sulochana rani, yaddanapudi, telugu writer yaddanapudi,.
యద్దనపూడి సులోచనారాణి ఆఖరి ఇంటర్వ్యు