సిరియా లో నెలకొన్న సంక్షేభం మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తోందా..? ఇప్పుడు ఇవే భయాలు వెన్నాడుతున్నాయి. సిరియా లో పరిస్థితి అదుపుతప్పింది. అమెరికా, రష్యాలు సిరియా వేదికగా రెండు వర్గాలుగా చీలిపోయి పోరాటం చేస్తున్నాయి. రష్యా వ్యతిరేక వర్గాలకు అమెరికా అండగా నిలుస్తుండగా అమెరికా వ్యతిరేకులకు రష్యా సహాయం చేస్తోంది. అమెరికా, రష్యాలు నేరుగా తలపడకపోయినా సిరియాలో పోరాటం చేస్తున్న రెండు వర్గాల్లో ఒకదానికి అమెరికా, రెండో దానికి రష్యాలు బాసటగా నిలుస్తున్నాయి.
సిరియా వేదికగా నెలకొన్న ఉధ్రిక్తతలు మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా, రష్యాలు రెండు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. సిరాయా ప్రభుత్వానికి రష్యా మద్దతు ఇస్తుండగా సిరియాలో తిరుగుబాటు చేస్తున్న కొన్ని వర్గాలకు అమెరికా మద్దతు ఇస్తోంది. ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలతో మాత్రం అమెరికా,రష్యాలు రెండూ పోరాడుతున్నాయి.
సిరియా ప్రభుత్వ వర్గాలు అమెరికా తిరుగుబాటు దారుల ఆధీనంలోని భూబాగంపైకి పెద్దఎత్తున దాడులకు దిగుతోంది. ఈ పోరాటంలో సిరియా ప్రభుత్వం రసాయన దాడులు చేస్తోందనేది అమెరికా ఆరోపణ. సొంత పౌరులపై సిరియా దళాలు రసాయనికి ఆయుధాలు ప్రయోగించారని అరోపిస్తున్న అమెరికా సిరియా ప్రభుత్వ వర్గాలకు పట్టున్న ప్రాంతాలపై విరుచుకుని పడింది. యుద్ద వాహక నౌకల నుండి క్షిపణులను ప్రయోగించింది. అమెరికా చర్యలపై రష్యా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది.
సిరియా పై దాడులకు దిగిన అమెరికాకు బ్రిటన్, ప్రాన్స్ లు పూర్తిగా మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే బ్రిటన్ పై గుర్రుగా ఉన్న రష్యాకు ఈ చర్యలు మరింత ఆగ్రహం తెప్పించాయి. సిరియాలో అమెరికా దాని మిత్రదేశాల చర్యలను ఏమాత్రం సహించేది లేదని రష్యా హెచ్చరికలు చేస్తోంది. వారికి తగిన గుణపాఠం చెప్తామని అంటోంది. సైనిక చర్యలతోపాటుగా ఎటువంటి దానికైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ రష్యా హూంకరిస్తోంది.
సిరియాలో అమెరికా చర్యలను రష్యాతో పాటుగా చైనా కూడా వ్యతిరేకిస్తోంది. తమ దేశ పౌరులు ఎటువంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ రష్యా ప్రకటించింది. ఈ మేరకు ఆదేశ అధికారిక టెలివిజన్ లో ప్రకటనలు జారీ అయ్యాయి. పరిస్థితులు చేయిదాటిపోతే మూడవ ప్రపంచ యుద్ధం అవకాశాలు లేకపోలేదని దానికి తమ ప్రజలను సిద్ధం చేస్తున్నట్టు రష్యా చేసిన ప్రకటనతో పరిస్థితులు మరింత జటిలంగా మారాయి.
సిరియాలో రెండు అగ్రరాజ్యాల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తమ,తమ మద్దతుదారులకు పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తున్న అగ్రరాజ్యాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదకర స్థాయికి అమెరిక, రష్యా సంబంధాలు చేరుకున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎప్పుడైనా పరిస్థితి చేతులు దాటిపోయే అవకాశం ఉందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అగ్రరాజ్యాల అదిపత్య పోరులో ప్రపంచశాంతికి విఘాతం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ముదిరే పక్షంలో సిరియా సంక్షోభం మరితం తీవ్ర దూరం దాల్చి అది మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు వేసినా ఆశ్చార్యపడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.
US and allies strikes, Syria , Donald Trump, Vladimir Putin , Syrian military, British, French , Russians, third world war, Missiles streak, Damascus ,
సిరియా పై అమెరికా దాడి
World_War_III
Nuclear_weapon
United_States
population
World_population
Roman_emperor