వాఘా సరిహద్దు లో పాక్ క్రికెటర్ వెకిలి వేషాలు | pak cricketer

భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ, వెకిలి వేషాలు వేయడంలోనూ పాకిస్థాన్ క్రికెటర్లు ఎప్పుడూ మూందుంటారు. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ వాఘా సరిహద్దు వద్ద వెకిలి చేష్టలు చేస్తూ మరోసారి తమ నైజాన్ని చాటుకున్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని వాఘా వద్ద ప్రతీరోజు పెరెడ్ జరిగే సంగతి తెలిసిందే. ఈ పెరెడ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెటర్ హసన్ ఆలీ చేసిన చేష్టలు వారి నైజాన్ని చాటాయి.
వాఘా వద్ద ప్రతీరోజు రెరెడ్ జురుగుతుంటుంటి. భారత్, పాకిస్థాన్ లకు చెందిన జవాన్లు పెరెడ్ నిర్వహిస్తుంటారు. సరిహద్దులు మూసేవేసే సమయంలో జరిగే ఈ పెరెడ్ ను తిలకించడానికి పెద్ద సంఖ్యలో ఇరు వైపుల నుండి ప్రజలు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన క్రికెట్ సభ్యులు వాఘా సరిహద్దుల వద్దకి వచ్చారు. పెరెడ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మధ్యలోకి దూసుకునివచ్చిన హసన్ ఆలీ భారత జవాన్ల వైపు తిరిగి అభ్యంతరకరంగా వ్యవహరించాడు. తొడలు కొడుతూ భారత జవాన్లను కవ్వించే ప్రయత్నం చేశాడు.
హసన్ ఆలీ సిగ్గులేని చర్యను పాకిస్థానీ క్రికెట్ బోర్డు అధికారిక ట్విటర్ లో షేర్ చేయడంతో ఇప్పుడు ఇది వైరల్ అయింది. తమ క్రికెటర్ చర్యను పాకిస్థాన్ లో కొంతమంది సమర్థిస్తుండగా మరికొందరి మాత్రం తప్పుబడుతున్నారు. ఇటు భారత్ అధికారులు ఈ వ్యహారంపై పాకిస్థాన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. పెరెడ్ జరుగుతున్న ప్రదేశంలోకి దూసుకుని వచ్చి ఈ విధంగా వ్యవహరించడం సమంజసం కాదని భారత్ అంటోంది. తమ అభ్యంతరాన్ని పాకిస్థాన్ కు తెలపనున్నట్టు వెల్లడించింది.
ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఏ విధంగా వ్యహరించినా తమకు సంబంధం లేదని కానీ పెరెడ్ జరుగుతున్న ప్రాంతంలోకి వచ్చి అభ్యంతరకరంగా వ్యవహరించడం సరికాదని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు అంటున్నారు. భారత్ పై అసహనాన్ని ప్రదర్శించడం పాకిస్థాన్ క్రికెటర్లకు కొత్తేమీ కాదు. నోటికి వచ్చినట్టు వాగే పాక్ క్రికెటర్లకు హుందా వ్యవహరించడం ఏ మాత్రం చేతకాదనే విషయం పలుమార్లు రుజువయింది.ఒక అంతర్జాతీయ క్రీడాకారులు హసన్ ఆలీ చేసిన చేష్టలు దారుణంగా ఉన్నాయి.
pakistan, pakistani cricketer, hasan ali pakistani cricketer, pakistan cricket board.