వైజాగ్ చేప అసలు కథ ఇదే…

విశాఖపట్నంలో వింత చేప బయటపడిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. కొద్ది రోజుల క్రితం వింత పక్షులు అంటూ జరిగిన ప్రచారాన్ని మనం చూశాం. తీరా అవి గుడ్లగుబలని తేల్చేశారు. తాజాగా వింత చేప అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని తేలిపోయింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వింత ఆకారానికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఒక సిలికాన్ మోడల్ కు చెందినది. వాస్తవానికి దగ్గరగా కనిపించే విధంగా దీన్ని వింత ఆకారంలో ఒక టీవీ షో కోసం రూపొందించినట్టు తెలుస్తోంది. ఇదే ఫొటో జల కన్యగా చాలా రోజుల క్రితమే పలు దేశాల్లో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయగా తాజాగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది వైరల్ అయింది.