అరకు దాడి ఘటనలో ముగ్గురు మావోలను గుర్తించిన పోలీసులు

vizag agency మావోయిస్టులు విశాఖ మన్యంలో హతమార్చిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భౌతికకాయాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పూర్తి అధికార లాంఛనాలతో వీరి అంత్యక్రియలు జరిగాయి. ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంత్యక్రియలు హాజరయ్యార. ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కిడారి సర్వేశ్వరరావు అంత్యక్రియలు పాడేరులో జరగ్గా, సివేరి సోమ అంత్యక్రియలు అరకులో జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబీకులను ఫోనులో పరామర్శించారు. వారిని అన్నిరకాలుగా ఆదుకుంటామని చెప్పారు.
vizag agency
మరోవైపు విశాఖ మన్యాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నార. ఒక ఎమ్మెల్యేతో పాటుగా మరో మాజీ ఎమ్మెల్యేను మావోలు హతమార్చడంతో ఒక్కసారిగా విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మన్యంలో మావోలు అడపాదడపా విధ్వంసాలకు పాల్పడుతున్నా ఎమ్మెల్యే స్థాయి నేతను హతమార్చడాన్ని పోలీసులు సవాలుగా స్వీకరిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేదానిపై పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. మొత్తం 60 మంది మావోలు ఈ ఘటనలో పాల్గొన్నట్టు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. వారిలో ముగ్గురిని గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
విశాఖ జిల్లా కరకపాలెంకు చెందిన అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య , భీమవరానికి చెందిన స్వరూప అలియాస్ కామేశ్వరి, దబ్బపాలెం మండలం అడ్డతీగలకు చెందిన జులుమూరి శీను బాబు అలియాస్ సునీల్ లు ఈ దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరి ఫొటోలను విడుదల చేసిన పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. వీరి ముగ్గురితో పాటుగా ఇంకా ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్షసాక్షులను విచారించిన తరువాత దాడికి పాల్పడింది ఎవరనే దాని ఓ అంచనాకు వస్తున్నారు.

ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలోనూ మెట్రో పరుగులు


సర్జికల్ దాడులు చేస్తే కానీ వాళ్లకు బుద్ది రాదు: బిపిన్ రావత్