అదిరే స్టెప్పులేసిన విరాట్-అనుష్క

భారత క్రికెట్ జట్ట కెప్టెన్ విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ ల రిసెప్షన్ ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ విందుకు హాజరయినవారిలో ఉన్నారు. ఈ రిసెప్క్షన్ లో ప్రముఖ పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ సంగీత కచేరీ జరిగింది. మాన్ పాటలకు కొత్త జంట కోహ్లీ-అనుష్కశర్మల డ్యాన్స్ ఆకట్టుకుంది. వీరితో పాటుగా శిఖర్ ధావన్ కూడా డ్యాన్స్ చేశాడు. ఈనెల 27న ఈ జంట ముంబాయిలో మరో విందు ఇవ్వనుంది. సినీ, క్రీడా ప్రముఖులు దీనికి హాజరుకానున్నారు. కోహ్లీ-అనుష్కల డ్యాన్స్ ను మీరూ చూడండి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *