బీజేపీలో చేరిన విరాట్ కోహ్లీ?-వాస్తావాలు ఏంటి?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ బీజేపీలో చేరాడా…? సామాజిక మాధ్యామాల్లో ఈ వార్త వైరల్ గా మారింది. కోహ్లీ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరినట్టుగా ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. బీజేపీ కండువా, టోపీ ధరించిన కోహ్లీని మోడీ బుజంతడుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా బీజేపీ శ్రేణుల్లో ఈ ఫొటో తెగ ప్రచారంలో ఉంది…
అయితే కోహ్లీ బీజేపీలో చేరాడనేది పూర్తిగా సత్యదూరం… ఆయన బీజేపీలో పార్టీలో చేరడంగానీ దానికి సంబంధించిన ప్రకటన కానీ చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నట్టుగా కోహ్లీ ఇప్పుడు అసలు భారత్ లోనే లేడు. ఆయన ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ లో ఉన్న కోహ్లీ ఎప్పుడు ప్రధానిని కలిసి బీజేపీలో చేరాడని పలువురు పశ్నిస్తున్నారు.
అసలు ఆ ఫొటో తన పెళ్లినికి ఆహ్వానించేందుకు కోహ్లీ ప్రధానని కలిసిన సమయంలోది. ఆ ఫొటోను మార్ఫ్ చేసిన కొందరు ప్రధాని సమక్షంలో కోహ్లీ బీజేపీలో చేరాడంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇదికాస్తా వైరల్ గా మారింది.
virat, virat kohli in bjp, virat kohli join in bjp.

సెల్ ఫోన్ కోసం స్నేహితుడి దారుణ హత్య


వీహెచ్ పై మండిపడుతున్న అంజన్ కుమార్ యాదవ్