హింధుత్వంపై కుట్ర -ఏపీ దేవాదాయ శాఖ మంత్రి

హిందుత్వంపై కుట్ర జరుగుతోంది… ఈ మాటలు అన్నిది ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకే ఈ అనుమానం వచ్చింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే హిందుత్వం పై కుట్రజరుగుతున్నట్టుగా అనిపిస్తోందన్నారు. విజయవాడ గుడిలో తప్పుజరిగిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే ఏ తప్పు జరిగింది ఎవరు చేశారు అనే దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని జరుగుతున్న ప్రచారంపై మంత్రి స్పందించారు. దేవాలయంలో కొన్ని తప్పులు జరిగాయని వాటిపై 48 గంటల్లో నివేదిక వస్తుందని అన్నారు. దేవాలయంలో జరిగిన అపచారాల వెనుక ఎంతటి వారున్నా విడిచిపెట్టే సమస్యేలేదని మంత్రి స్పష్టం చేశారు.
మరో వైపు దుర్గగుడిలో చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకిటిగా పేరున్న దుర్గగుడిలో చోటుచేసుకుంటన్న ఘటనలపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుతో చంద్రబాబు సమావేశం కానున్నారు.