ఐలయ్య, వైశ్య పోటాపోటీ సభలకు అనుమతి నిరాకరణ

విజయవాడలో నిర్వహించ తలపెట్టిన ‘కంచ ఐలయ్య సంఘీభావం’ సభకు అనుమతిలేదని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. దీనితో పాటుగా బ్రాహ్మణ, వైశ్య ఐక్యవేదిక తలపెట్టిన సభకు కూడా అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇరు వర్గాలు పోటాపోటీగా సభలు నిర్వహించడం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు అంటున్నారు. ఈ సభలకు అనుమతి ఇచ్చేది లేదంటూ ముందు జాగ్రత్త చర్యగా సభ నిర్వహించ తలపెట్టిన ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు. దీనితో పాటుగా సభకు అనుమతి లేదంటూ విజయవాడ పోలీసుల కంచె ఐలయ్యకు నోటీసులు జారీ చేశారు. తార్నాకాలోని ఐలయ్య నివాసానికి వచ్చిన విజయవాడ పోలీసులు సభకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడ డీసీపీ క్రాంతీ రాణా పేరుతో లేఖను ఐలయ్యకు అందచేశారు. రెండు సభలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పడంతో తాము నిర్వహించ తలపెట్టిన సభను రద్దు చేస్తున్నట్టు బ్రాహ్మణ, వైశ్య ఐక్య వేదిక వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇచ్చిన నోటీసులు తనకు అందినట్టు ప్రొఫెసర్ కంచె ఐలయ్య తెలిపారు. సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఐలయ్య అంటున్నారు. తన వెనుక ఎటువంటి శక్తులు లేవని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తన సభను అడ్డుకోవడం వెనక రాజకీయ కోణం ఉందటున్నారు. ఐలయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *