తాగి ఊగే బదులు ఇట్లా కూడా చేయవచ్చు…

కొత్త సంవత్సరం పేరిట జరుగుతున్న హంగామాను ఆపాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థిక నిపుణలు, సామాజిక కార్యకర్త విజయ్ అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో జరుగుతున్న దుబారాను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రజా ఉధ్యమాన్ని ప్రారంభింస్తున్నట్టు చెప్పారు. దీనిపై మీడియాలో చర్చజరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పంపిన పోస్టు యధాతదంగా…

ఏదైనా దమ్మున్నఛానల్ ఉంటే ఈ ప్రచారాన్ని చేప్పట్టవచ్చు కదా! కేవలం ఎంచుకున్న వాటికే గగ్గోలు పెడతారా?
ఈ రోజు మొదలు ఓ పది రోజుల పాటు అదే ఆంగ్ల సంవత్సరాదివరకు కోట్లకొద్దీ డబ్బులు వెచ్చించి

కేకులు కొనేబదులు పేదలకు అన్నం పెట్టొచ్చుగా!

అనవసర విద్యుత్ అలంకరణలు చేపట్టి విద్యుత్ వృధా చేసే బదులు పేద అనాధ బాలబాలికల చదువు కి వెచ్చించచ్చుగా!

పీపాల కొద్దీ ఆల్కహాల్ పానీయాలు త్రాగి తందనాలు ఆడే బదులు బీద ప్రజలకి దుస్తులు పంచొచ్చుగా!

చెట్లు నరికి అలంకరణలు చేసి పర్యావరణానికి హాని చేసే బదులు అదే సందర్భంగా చెట్లు నాటొచ్చుగా!

సంబరాల పేరుతో టపాకాయలు కాల్చి వాయు కాలుష్యం పెంచే బదులు కనీస సౌకర్యాలు లేని ఆసుపత్రుల్లో అవి కల్పించొచ్చుగా!

నేను నా కర్తవ్యమ్ చేస్తున్నాఅందరు ఈవిధంగా చేయొచ్చేమో అలోచించి ఈ ప్రచారం చెయ్యొచ్చు!

సేవ్ ది చిల్డ్రన్ – HYD
www.savethechildren.in

తపస్వి అనాధ బాలుర ఆశ్రమం – HYD
www.tapasviindia.org

న్యూ లైఫ్ ఫౌండేషన్ – HYD
www.newlifefoundationhyd.org