ప్రధాని తల్లి మార్ఫింగ్ ఫొటో-చిక్కుల్లో కేంద్ర మంత్రి

ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రయత్నించిన కేంద్ర మంత్రి విజయ్ సంపాల ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి ఇప్పటికీ కూడా సాధారణ మహిళ లాగా ఆటోలో ప్రయాణిస్తుంది అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫొటోను పోస్ట్ చేశారు. తీరా అది మార్ఫింగ్ చేసిన ఫొటో అని తేలడంలో పాపం మంత్రి గారు ఇబ్బందుల్లో పడ్డారు. నరేంద్ర మోడి తల్లి ఫొటో అంటూ ఓ ఫొటోను పెట్టడంతో పాటుగా రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీపై విమర్శలు కూడా చేసిపారేశాడా మంత్రి దీనితో చిక్కులు మరింత ఎక్కువయ్యాయి.
మంత్రిగారు పోస్ట్ చేసింది మార్ఫింగ్ ఫోటోగా గుర్తించిన నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురింపించారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు పెడుతూ రాజకీయ లబ్దికోసం ప్రయత్నించడం దారుణమని పలువురు వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకీయ నేతల్లో సోనియా గాంధీ నాలుగోస్థానంలో ఉన్నారంటూ మంత్రి విజయ్ సంపాల చేసిన కామెంట్లపై కూడా నెటిజన్లు విరుచుకుని పడుతున్నారు. సరైన సమాచారం లేకుండా కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి సాధారణ వ్యక్తిలాగా కామెంట్లు చేయడం ఏమిటని వారు విమర్శిస్తున్నారు.
మార్ఫింగ్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ తల్లి ఫొటోలను కేంద్ర మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ట్విట్టర్ పెట్టడంపై ఒక్కసారిగా దుమారం రేగింది. మార్ఫింగ్ చేసిన ఫొటోలు పెట్టడం బీజేపీ నేతలకు అలవాటేనని పలువురు వ్యాఖ్యానించారు.
మరో వైపు ఆ ఫొటో నిజమైనది అయినా కనీసం తల్లిని కూడా పట్టించుకోని ప్రధాని దేశాన్ని ఎం పట్టించుకుంటారని పలువరు వ్యాఖ్యానించారు. తల్లిని కూడా సరిగా పట్టించుకోని ప్రధానమంత్రి అంటూ కొందరు విమర్శల వర్షం కురిపించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులకు, బీజేపీ ప్రజాప్రతినిధులకు చేస్తున్న హెచ్చరికలు వారి చెవికి ఎక్కుతున్నట్టు కనిపించడం లేదు.
బీజేపీ నేతలు ఎక్కడో ఏదో మూల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఒకటి చెప్పదల్చుకుని మరోకటి చెప్తూ అడ్డంగా దొరికి పోతున్నారు. చాలా సార్లు ఏదో ఘనకార్యం చేయబోయి అదికాస్త మిస్ ఫైర్ అవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దళితుల ఇంట్లో దోమల గురించి యూపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపగా త్రిపుర ముఖ్యమంత్రి సృష్టిస్తున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.
బీజేపీకి చెందిన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతుండడంతో వారిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోడి వారికి మార్గదర్శకాలు జారీ చేశారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించడంతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాని కూడా మోడి తన సహజరులకు సూచించినా అవేవీ పట్టించుకోకుండా వారు చేస్తున్న చర్యలు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.
మోడీని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా కొన్నిసార్లు బెడిసికొడుతోంది. కేంద్ర మంత్రి విజయ్ సంపాల విషయం ఇందుకో మంచి ఉదాహరణ.
bjp, bharathiya janatha party, prime minister, narendra modi, Vijay Sampla, central ministar Vijay Sampla.

రాష్ట్ర మంత్రి పదవిపై ఎంపీ మల్లారెడ్డి కన్ను…?


aditi-singh/
Vijay_Sampla