విజయ్ సాయి పై భార్య సంచలన ఆరోపణ…

సినీ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య వ్యవహారం క్షణాకో మలుపు తిరుగుతోంది. తన భర్త మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని విజయ్ సాయి భార్య వనితా రెడ్డి అంటున్నారు.విజయ్ సాయికి అతని తండ్రితో కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలున్నాయని అంటున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకునే కొన్ని గంటల ముందు తన కూతురిని కలవడానికి వచ్చడాని అప్పుడు చాలా ఆనందంగా కనిపించిన ఆయన అంతలోనే ఎందుకు ఆత్మహత్యకు పాల్పడతాడని అంటోంది. పైగా సెల్ఫీ వీడియోలో తనతో పాటుగా మరికొందరిపై ఆరోపణలు చేయడం కూడా తన అనుమానాలను మరింత పెంచుతోందని అంటున్న వనితా రెడ్డి తన భర్త కు హెచ్.ఐ.వి ఉందంటూ మరో బాంబు పెల్చింది. అనేక మంది మహిళలతో విజయ్ సాయికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్తున్న ఆమె తన భర్తకు హెచ్.ఐ.వి సోకిందని అంటోంది.
మరో వైపు వనితా రెడ్డి ఆరోపణలను విజయ్ సాయి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఇటువంటి దారుణ ఆరోపణలు చేయడం సరికాదని వారంటున్నారు. విజయ్ సాయి మరణానికి వనితా రెడ్డే కారణమని ఆమె ప్రవర్తన మంచిది కాదని వారు చెప్తున్నారు. వనితా రెడ్డి బయటపెట్టిన ఆడియో టేపులో గొంత తనది కాదని విజయ్ సాయి తండ్రి అంటున్నాడు. అటు విజయ్ సాయి -వనితా రెడ్డి ల మధ్య జరిగినట్టుగా చెప్తున్న మరో ఆడియో ను ఆయన కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఇందులో వీరిద్దరికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా ఉంది. ఆ ఆడియో వినండి…