పాత్రికేయుడు ఎన్. వేణు గోపాల్ అరెస్ట్

సీనియర్ పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్ రావును పోలీసులు అరెస్టు చేశారు. బాగ్ లింగంపల్లిలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. వెణుగోపాల్ రావును ఎందుకు ఆరెస్టు చేశారనేదానిపై ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిస్తూ వేణుగోపాల్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటుగా కొత్తగూడెం ఎన్ కౌంటర్ పై కూడా పలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేసిన నేపధ్యంలో వేణుగోపాల్ ఆరెస్టు ప్రాధన్యం సంతరంచుకుంది. నారాయణ గూడలోని ఆయన నివాసం వద్దే వేణుగోపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సర్కారు వైఫల్యాల మీద అనేక ఆర్టికల్స్ రాస్తున్న వేణుగోపాల్ ప్రపంచ తెలుగు మాహా సభలను బహిష్కరించాల్సిందిగా కూడా పిలుపునిచ్చారు. . విరసం నేత, మావోయిస్టు సానుభూతిపరుడు వరవరరావుకు వేణు స్వయాన మేనల్లుడు.