యూపీలో బీజేపీకి ఎదురు దెబ్బ

ఉత్తర్ ప్రదేశ్ లోని రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ తో పాటుగా పూల్ పుర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. గోరఖ్ పూర్ లో కూడా బీజేపీ ఓడిపోవడంతో ముఖ్యమంత్రికి గట్టిఎదురుదెబ్బ తగిలింది. గోరఖ్ పూర్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించారు. పూల్ పుర్ లో ఉప ముఖ్యమంత్రి మౌర్య రాజీనామా చేయడంతో ఎన్నికలు జరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఖాళీచేసిన లోక్ సభ స్థానాలను బీజేపీ కోల్పోతోంది. దీనితో పార్టీవర్గాలు నిరాశతో నిండిపోగా ఇటు రెండు స్థానాల్లోనూ భారీ ఆదిఖ్యంలో ఉన్న సమాజ్ వాదీపార్టీ వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నాయి. సమాజ్ వాదీ పార్టీ ఈ రెండు స్థానాల్లోనూ బీఎస్పీ మద్దతుతో బరిగిలోకి దిగింది. ఉత్తర్ ప్రదేశ్ లో మొదటినుండి వైరి వర్గాలయిన సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీల మైత్రికి ప్రజల మద్దతు కనిపిస్తోంది. పుల్ పురాలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి 59613 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అటు బీహార్ లోని అరారియా లోక్ సభ స్థానాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి 57358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ భారీ ఆదిఖ్యంలో ఉన్నారు. లాలూ జైలునుండి ఈ ఎన్నికల కోసం వ్యూహాలు పన్నిన సంగతి తెలిసిందే. జెహానాబాద్ అసెంబ్లీ స్థానంలోనూ ఆర్జేడీనే ముందుండగా భజువాలో బీజేపీ అభ్యర్థి ఆదిక్యంలో ఉన్నారు.
uttar pradesh, up, uttarpradesh, uttarpradesh elecion, yogi, yogi adityanath, bihar, laloo prasad yadav.
RJD wins in Araria by-election by a margin of 57358
SP wins in Phulpur By-election by a margin of 59613 votes


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *