పాకిస్థాన్ కు అమెరికా మరో హెచ్చరిక

ఆగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్ కు మరో అల్టిమేటం జారీ ఇచ్చింది. పాకిస్థాన్ లోని ఉగ్రవాదులపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్ ను హెచ్చరించింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోతే మరిన్ని చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికా నుండి పాకిస్థాన్ కు అందాల్సిన సహాయాన్ని నిలిపివేసిన అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షాలకు సిద్ధపడుతోంది. ఉగ్రవాదాన్ని ఆపే శక్తి పాకిస్థాన్ కు ఉందని పాక్ ఆపనిని వెంటనే మొదలు పెట్టాలంటూ అమెరికా తీవ్రంగానే హెచ్చరికలు చేసింది. రానున్న కాలంలో మరిన్న చర్యలు తప్పవని అమెరికా హెచ్చరికలు చేసింది.
అమెరికా బెదిరింపులతో పాకిస్థాన్ తన స్వరాన్ని మార్చింది. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన పాకిస్థాన్ తాజాగా ఒక మెట్టు దిగివచ్చింది. ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు అన్నివిధాలుగా సహకరిస్తామని చెప్తున్న పాకిస్థాన్ తమ సమాచార వ్యవస్థతో పాటుగా సైనిక స్థావరాలను కూడా అగ్రరాజ్యానికి అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. మరో వైపు పాకిస్థాన్ లో అతివాదులు మాత్రం అమెరికా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు.