అమెరికాకు హెచ్-4 వీసా పై వెళ్లినవాళ్లు ఇట్లా చేస్తే ఇబ్బందులు ఖాయం

0
57
h4 visa

భారత్ నుండి అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఎక్కువ శాతం హెచ్-1బి వీసా లపై వెళ్లినవారే. వీరి జీవిత భాగస్వాములకు అమెరికా ప్రభుత్వం హెచ్-4 వీసాను మంజూరు చేస్తుంది. ఈ విసాపై అమెరికా వెళ్లినవారు నిబంధనల ప్రకారం అక్కడ ఎటువంటి ఉద్యోగాలు, వ్యాపారులతో పాటు ఆర్థికంగా లబ్ది చేకూర్చే ఎటువంటి పనులు చేయకూడదు. అయితే అవగాహన లేకపోవడం, ఏమీకాదులే అనే ధైర్యంతో చేసే కొన్ని పనులు వారిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. హెచ్-4 వీసాలపై అక్కడికి వెళ్లినవారు ఆర్థికంగా లబ్ది చేకూర్చే పనులు చేయడం వల్లే వారితో పాటుగా హెచ్-1బీ వీసా పై ఉన్న జీవిత భాగస్వాములు కూడా భారత్ కు తిరిగి వచ్చేయాల్సి వస్తోంది. ఇటుంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయని నిపుణలు చెప్తున్నారు. అమెరికా వీసా ల నిబంధనలు ఉల్లంఘించి ఇబ్బందుల పడిన భారతీయులకు సంబంధించిన పలు కేసులను వారు ఉదహరిస్తున్నారు….
ఇటీవలే అమెరికాకు వెళ్లిన ఒక యువజంట ఇదే విధంగా చిక్కుల్లో పడిందని వారిని భారత్ కు తిప్పి పంపేశారని అమెరికాలోని తెలుగు న్యాయవాది రమేష్ చెన్నమనేని ‘తెలంగాణ హెడ్ లైన్స్’ వివరించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తెలుగు వ్యక్తి కొత్తగా అమెరికాకు వచ్చాడని, ఆయనతో పాటుగా వచ్చిన భార్య ఇంట్లో ఖాళీగా ఉడడం ఇష్టం లేక ఇంట్లోనే తెలిసినవారికి బ్యూటీ పార్లర్ సేవలు అందిస్తూ వచ్చిందని క్రమంగా తన వద్దకు వచ్చేవారి సంఖ్య పెరగడంతో ఫేజ్ బుక్ లో ఒక పేజీని క్రియేట్ చేసిందని దీనిపై సమాచారం అందుకున్న అమెరికా వలసల , పౌరసత్వం విభాగం (U.S. Citizenship and Immigration Services (USCIS)) అధికారులు ఇంటిని సోదా చేసి ఆమె నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందటూ ఆమెతో పాటుగా భర్తను కూడా భారత్ పంపేశారని చెప్పారు. దీని వల్ల ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆర్థికంగా చాలా నష్టపోయిందన్నారు.
అమెరికాకు హెచ్-1బీ పై వచ్చిన వారి జీవిత భాగస్వాములు చాలా మంది ఖాళీగా ఉండడం ఇష్టం లేదనే లేకుంటే ఆర్థికంగా కలిసి వస్తుందనే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నిపులు చెప్తున్నారు. హెచ్-4 వీసాపై అమెరికాకు వచ్చిన వారు ఎటువంటి ఉద్యోగాలు చేయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ గ్రాసరీ స్టోర్ లలోనూ, గ్యాస్ స్టేషన్ లలోనూ నిబంధనలు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తునారు. కొంత మంది ఇంట్లో మ్యూజిక్ క్లాసులు నిర్వహించడం, పిల్లలు పాఠాలు చెప్పడం, కర్రీ పాయింట్ల తరహాలు వంటలు చేయడం లాంటి పనులు చేస్తున్నారని ఇవి కూడా నిబంధనలకు వ్యతిరేకం అన్న సంగతి గుర్తించుకోవాలంటున్నారు.
భారత్ నుండి బంధువుల ద్వారా, దుస్తులు, భారతీయ వంటకాలు, పచ్చళ్ల లాంటివి తెప్పిచ్చుకుని వ్యాపారం చేస్తుంటారని ఇటువంటి చర్యలను అమెరికా వలసల , పౌరసత్వం విభాగం (U.S. Citizenship and Immigration Services (USCIS)) ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని ఇటువంటి వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇటీవల కాలంలో నిఘా మరింత ఎక్కువ పెరిగిందని మన గురించి సమాచారం ఎవరు ఇస్తారనేది తెలియదని, సామాజిక మాధ్యమాలను సదరు అధికారులు ఎప్పటికప్పుడు కనిపెడుతున్నారని చెప్పారు.
U.S. Citizenship and Immigration Services (USCIS), usa, h1b, visa , america visa, h4 visa.

వీసా గడువు ముగిసినా అమెరికాలోనే


గురుకుల విద్యార్థి ఉసురు తీసిన నిర్లక్ష్యం?

Wanna Share it with loved ones?