యూపీ సీఎం ను పెళ్లాడిన మహిళ

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఓ మహిళ పెల్లాడింది. కాషయం కట్టుకునే సీఎం పెళ్లిపీటలు ఎక్కారా అని ఆశ్చర్యపోకండి. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ మహిళ సీఎం ఆదిత్యనాథ్ ఫొటోను పెళ్లి చేసుకుంది. అయితే ఇతంతా ఓ నిరసన కార్యక్రమంలో భాగంగానే అట.తమ డిమాండ్ల సాధన కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఏదీ రాకపోవడంతో వారు వినూత్మంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఫొటోను పెట్టుకుని ఒక అంగన్వాడీ కార్యకర్త పెళ్లి తంతు జరిపించుకున్నారు. తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లడానికే ఈవిధంగా నిరసనకు దిగినట్టు వారు చెప్పారు. ముఖ్యమంత్రి ఫొటోను పెల్లాడిని మహిళ అంగన్వాడీ కరీమ్ చారీ జిల్లా అధ్యక్షురాలు నీతు సింగ్.
ముఖ్యమంత్రి తమ సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని నీతూ సింగ్ అంటున్నారు. ఎన్నిసార్లు ముఖ్యమంత్రికి, అధికారుల దృష్టికి సమస్యలను తీసుకుని వెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికీ సీఎం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పట్టించుకోకపోతే గుర్రంపై ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్తానని అంటున్నారు. ముఖ్యమంత్రి తమ సమస్యలను సత్వరం పరిష్కరించాలని లేకుంటే మరిన్ని ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.
చాలా సంవత్సరాల క్రింతం స్టార్ హీరో రాజేష్ ఖన్నా ఫొటోను చాలా మంది యువతులు పెళ్లి చేసుకున్నారట. మళ్లీ ఇప్పుడు యూపీ సీఎం ఫొటోను ఓ మహిళ పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. అప్పట్లో అభిమానంతో పెళ్లి చేసుకోగా ఇప్పుడు నిరసన కార్యక్రమాల్లో భాగంగా పెళ్లి చేసుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *