మరో సారి తెరమీదికి యునైటెడ్ ఫ్రంట్ | United Front again?

ఎన్డీఏ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్ ను తెరతీసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణా ముఖ్యమంత్రి ఇప్పటికీ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెసేతర కూటమికి ప్రయత్నాలు చేస్తుండగా ఇదే తరహాలో యునైటెట్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వచ్చేందుకు చంద్రబాబు నాయుడు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
చంద్రబాబు గతంలో యునైటెడ్ ఫ్రంచ్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా అవే పరిచయాలతో మరోసారి ఫ్రంట్ ను తెరపైకి తీసుకుని వచ్చేందుకు బాబు విస్తృతంగా మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు దీని గురించి త్వరలోనే బహిరంగ ప్రకటచేస్తాని అంటున్నారు.
చంద్రబాబు కొత్త కూటమి ఏర్పాట్లలలో బీజీగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా కలుపుకుని ముందుకు పోతారా లేదా అన్ని దానిపై ఇంకా ఎటువంటి స్పష్టతా రాలేదని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు గండికొట్టాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వర్గాలు చెప్తున్నాయి.
సీనియర్ గా తానే ముందుండి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రను పోషించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఫశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ లతో పాటుగా ఓం ప్రకాష్ చౌతాలా, శరద్ పవార్, ఫారుల్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా అస్సాం గణపరిషత్ నేతలతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది.
బీజేపీ తనను దారుణంగా మోసంచేసిందనే కసితో ఉన్న చంద్రబాబు ఆ పార్టీకి ఏవిదంగానైనా బుద్దిచెప్పాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ వ్యతిరేక శాక్తులను అన్నింటిని ఒక తాటిపైకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసిన బాబు నేతలందరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.
బీజేపీని వ్యతిరేకించడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకించే వర్గాలను ఏకం చేయడానికి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వామపక్షాల నేతలతో కూడా బాబు టచ్ లో ఉన్నట్టు ఆ వర్గాలు చెప్తున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే మహానాడు సమయానికి అమరావితిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అమరావతి భారీ ర్యాలీ నిర్వహించాలని కూడా చంద్రబాబు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో యునైటెడ్ ఫ్రంట్ లో కీలక పాత్రను పోషించిన చంద్రబాబు తరువాత ఎన్డీఏ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదంటున్న చంద్రబాబు
United Front, Narendra Modi, Sharad Pawar (NCP), Akhilesh Yadav (SP), Mayawati (BS), Mamata Banerjee (TMC), Naveen Patnaik (BJD), MK Stalin (DMK), Farooq Abdullah (Jammu-Kashmir National Conference) , Om Prakash Chautala (Indian National Lok Dal) Asom Gana Parishad (AGP) and Arvind Kejriwal (AAP).