సాదాసీదా గా జైట్లీ పద్దు

0
68

ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆఖరు పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో పాటుగా త్వరలో ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలు. మరో సంవత్సరంలో జాతీయ ఎన్నికలు వస్తున్నందున ఈ బడ్జెట్ పై సామాన్యులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని భావించినప్పటికీ ఆ ఛాయలు బడ్జెట్ లో ఏ మాత్రం కనిపించలేదు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ముందు నుండీ చెప్తూవస్తున్న ప్రభుత్వం ప్రజలకు పెద్దగా వాతలు పెట్టనప్పటికీ వరాలు కూడా ఏమీ కురిపించలేదు. జీఎస్టీ అమలు తరువాత ఒకరకంగా చెప్పాలంటే బడ్జెట్ కు గతంలో ఉన్నంత ప్రాధాన్యం లేకుండా పోయింది. వివిధ రకాల వస్తువులపై పన్నుల వడ్డింపు కానీ వరాలు కానీ బడ్జెట్ లలో లేకపోవడంతో గతంలో కంటే బడ్జెట్ ప్రభ మసకబారిందనే చెప్పకతప్పదు.
మోడీ సర్కారు ఓ సమాన్యా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దేశంలోని అత్యధిక జనాభా ఆధారపడుతున్న వ్యవసాయ రంగానికి పెద్దపేట వేయడం బడ్జెట్ లో కనిపించే సానుకూలాశం. దేశనికి వెన్నుముక అయిన రైతన్నల వేతలు అన్నీ ఇన్నీ కావు. వాతారణం రైతులను ఒకవైపు ముంచుతుంటే మరో వైపు పండిన పంటకు గిట్టుబాడు ధర లేకపోవడం రైతును నిలువునా ముంచుతున్నాయి. రైతులకు కనీస మద్దతుధరను కల్పించేందుకు ప్రభుత్వం నడుంబిదించింది. ఉత్తత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. ఈ నిర్ణయం దేసంలోని రైతాంగం పాలిట చల్లని కబురుగానే చెప్పవచ్చు. దీనితో పాటుగా గ్రామీణ ప్రాంతంలో మౌళిక వసతులు కల్పించడంతో పాటుగా రోడ్డు సౌకర్యాన్ని మెరుగుపర్చడం ద్వారా పండిన పంటకు గిరాకీ ఉన్న ప్రాంతాలకు తరలించే అవకాశం కల్పించేందుకు ఉద్దేశించిన పథకాన్ని కూడా అమలు చేయడం మంచిపరిణామం.
దేశంలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గాను కేంద్ర ప్రభుత్వం భారీ పథకాన్ని చేపడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా ఇది నిల్చిపోనుంది. దేశంలోని 10కోట్ల మందికి లద్బి చేకూరేవిధంగా భీమా రక్షణ కల్పించేందుక ఉద్దేశించిన ఈ పథకం వల్ల ఆరోగ్యంపై భరోసా ఏర్పడుతుంది. ఇటువంటి పథకం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆరోగ్యశ్రీ లాంటి పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలుకానుంది. అయితే ఇందులో ఉన్న లోటు పాట్లను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారీ పథకానికి ప్రస్తుతం నిధుల కేటాయింపు అవసరం కనిపించడం లేదు. ఈ సంవత్సరం కార్డుల జారీతోనే సరిపోయే అవకాశం ఉన్నందున ఈ భారీ ప్రాజెక్టుకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి నిధులు అవసరం అవుతాయి. ఆరోగ్యం కేంద్రాల్లో మౌళిక వసతులకు పెద్ద పీట వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించినప్పటికీ ఆ మేరకు కేటాయింపులు జరగలేదు. ప్రస్తుత కేటాయింపులతో ఒక్కో కేంద్రానికి రు.80వేల రూపాయలు కూడా అందేఅవకాశం లేదు. ప్రజలకు భీమా సౌకర్యంతో పాటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌళికవసతులను మెరుగుపర్చడమే మంచిదని ఈ రంగనిపుణులు చాలా కాలంగా చేస్తున్నా వారి మాటలను కేంద్రం పెడచెవిన పెట్టినట్టుగానే కనిపిస్తోంది.
పరిశ్రమల మౌళిక వసతుల కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ఈ రంగానికి 5లక్షల కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. వీటితో పాటుగా చిన్నతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో భారీ కేటాయింపులే ప్రభుత్వం చేసింది. వ్యాపారులకు మరిన్ని రాయితీలు కల్పించినా వ్యాపార వర్గాలు ఆశించిన మేరకు రాయితీలు అందలేదు. పాత నోట్ల రద్దు, జీఎస్టీలతో దేశంలోని వ్యాపార రంగం కుదేలైన సంగతి వాస్తవం ఈ వర్గాల వారు ఆశించిన రాయితీలను కేంద్ర ప్రభుత్వం పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు.
అన్నింటికన్నా ముఖ్యంగా సగటు వేతన జీవులకు ఈ బడ్జెట్ లోనూ నిరాశే మిగిలింది. ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతారని ఆశించిన వారికి తీవ్ర నిరాశ తప్పలేదు. ముఖ్యంగా ఓ మోస్తరు ఉద్యోగస్తుల జీతాల్లో భారీ కోత పడుతుండడం వారికి మింగుడుపడడం లేదు. మారిన పరిస్థితుల దృష్ట్యా ఆదాయపుపన్ను రాయితీని ఆశించినా అది నిరాశగానే మిగిలిపోయింది. వేతన జీవుల వద్ద ముక్కుపిండి వసూలు చేసిన పన్నులను కార్పోరేట్ వర్గాలకు రాయితీలుగా ఇస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మొత్తం మీద మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ సాదాసీదాగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here