ఇంగ్లాండ్ లో 8మంది భారతీయుల మృతి

బిట్రన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఇంగ్లాండ్ హైవేపై
న్యూపోర్ట్ జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు విప్రో సంస్థకు చెందిన వారుగా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును రెండు లారీలు ఢీ కొనడంతో వీరి వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 11 మంది ప్రయాణికులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఐదు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. వీరంతా ఫ్రాన్స్ లో సెలవలు గడిపి లండన్ కు వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీలు ఢీకొట్టాయి. రెండు లారీల మధ్యలో మినీ బస్సు ఇరుక్కుని పోయిందని పోలీసులు వెల్లడించారు. ఇంగ్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులు మృతి చెందినట్టు విప్రో సంస్థ ప్రకటించింది. తమ సంస్థకు చెందిన కార్తికేయన్ రామసుభ్రమణ్యం, రుషీ రాజీవ్ కుమార్, వివేక్ భాస్కరన్ లు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు ఆ సంస్థ ప్రకటించింది. మరో ఉద్యోగి మనోరంజన్ పన్నీరు సెల్వం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు విప్రో ప్రతినిధి చెప్పాడు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో మిగిన వారంతా విప్రో సంస్థకు చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులని తెలుస్తోంది. బస్సు డ్రైవర్ కూడా భారత సంతతికి చెందినవాడే. అతని పేరు జోసఫ్ గా గుర్తించారు. ప్రమాదానికి లారీ డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. వారు అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా తమ వాహనాలను నడిపినట్టు పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *