టీటీడీలో 44 మంది అన్యమతస్థులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో 44 మంది అన్యమతస్థులు ఉన్నట్టు తేలింది. దేవస్థానం అధికారిక లెక్కలప్రకారమే 44 మంది అన్యమతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. ఇక అనధికారికంగా ఎంత ఉన్నారనే సంగతి తెలియడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వారంతా తప్పనిసరిగా హింధువులే అయిఉండాలనే నిబంధన ఉంది. దాన్ని తుంగలో తొక్కి 44మంది విధుల్లో చేరారు. 1989 నుండి ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివిధ శాఖల్లో వీరు పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీరికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరిని విధుల నుండి తొలగించకుండా ప్రభుత్వంలోని ఇతర శాఖలకు బదిలీచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీటీడీ లో ఉన్న అన్యమనతస్థులను టీటీడీ నుండి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ ఈఓ గోయల్ తెలిపారు.
తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ఉద్యోగులు కానీ మరెవరైనా సరే తిరుమలలో ఇతర మతాలకు సంబంధించిన ప్రచారాన్ని చేస్తే చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగులను పంపించివేస్తున్నామన్నారు.