విడుదలైన టీఆర్టీ నోటిఫికేషన్

చాలా కాలంగా తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. టీఆర్ టీ ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8792 ఉపాధ్యాయ పోస్టులకు గాను మొత్తం ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ల్‌ అసిస్టెంట్లు పోస్టులు 1941 ఉండగా 416 పీఈటీ పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు (వ్యాయామ విద్య) 9, భాషా పండితులు 1011, ఎస్‌జీటీ 5,415 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను అక్టోబర్ 30వ తేదీ నుండి నవంబర్ 30 వరకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరిలో పరీక్ష తేదీలను ప్రకటిస్తారు. ఈ పరీక్షలకు సుమారు నాలుగు లక్ష్లల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.
స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, భాషా పండితుల పోస్టులకు టెట్‌ 20శాతం వెయిటేజీ కల్పించనున్నారు. తెలంగాణలో 31 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *