టీఆర్టీ పరీక్ష సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య

0
58

టీఆర్టీ పరీక్ష సరిగా రాయలేదనే మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్యచేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో జరిగింది. టీఆర్టీపై గంపెడు ఆశలు పెట్టుకున్న సుప్రజ (24) పరీక్ష సరిగా రాయకపోవడంతో తీవ్ర నిరాశ చెందింది. మార్కులు తక్కువ వస్తాయని మనస్థాపం చెందిన ఆ యువతి నిండు ప్రాణాలను బలితీసుకుంది. టీఆర్టీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఉపాధ్యయ వృత్తిలోకి ప్రవేశిద్దామని భావించిన ఆమె తన కోరిక తీరే అవకాశం కనిపించకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య లేఖను రాసి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది.
సుప్రజ ఆత్మహత్య లేఖ ‘‘నాన్నా నన్ను క్షమించండి. చాలా కష్టపడ్డాను. కానీ ఫలితం లేకుండా పోయింది. నా చేతులారా నేనే చేసుకున్నా. నాకు బతికే అవకాశం లేదు. టీచర్‌ వృత్తిపై తప్ప దేనిపైనా నాకు ఆశలేదు. ఇన్ని రోజలు నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. ఇకపై ఆ అవసరం లేదు. నాకు ఉద్యోగం వస్తుందని చాలా కష్టపడి చదివాను. కానీ ఈ రోజు చాలా బాధగా ఉంది. నేను అనుకున్న జీవితం దక్కలేదు. క్షమించండి నాన్నా. నాకు ఉరివేసుకోవడం ఎలాగో తెలియడం లేదు. ఎంత ప్రయత్నించినా చావు రావడం లేదు. అందరూ క్షమించండి. నా వల్ల ఎవరూ బాధపడొద్దు. విధి నాతో ఆడుకుంది. చదువురాని దానిలా ముద్రవేసింది. నా కంటే చిన్నవాళ్లు నా ముందే పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా నాకు తర్వాత జీవితం ఉందనకున్నా. కానీ ఇప్పుడు నాకు భవిష్యత్తు లేదు. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి నాన్నా..’’


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here