టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే…

టీఆర్ఎస్ నుండి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు జోగినపల్లి సంతోష్ కుమార్, నల్గొండకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, వరంగల్ కు చెందిన బండ ప్రకాష్ ముదిరాజ్ లను పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుగా గాంచిన సంతోష్ కుమార్ కు రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు గతంలోనే ఖరారు కాగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఒక సీటును యాదవులకు కేటాయించారు. దీనికిగాను చాలా పేర్లను పరిశీలించిన తరువాత బడుగుల లింగయ్య యాదవ్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణలో మరో బలమైన సామాజిక వర్గం ముదిరాజులకు మరోసీటును కేటాయించారు. వరంగల్ కు చెందిన బండ ప్రకాష్ ను కేసీఆర్ ఎంపిక చేశారు. వివిధ సమీకరణాలను పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ అధిష్టానం వీరిని ఎంపిక చేసింది.
టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు. వీరంతా రేపు నామినేష్లను దాఖలు చేయనున్నారు. ముగ్గురు అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు.
jogininapalli santosh, trs,telangana,telangana rajya sabha, rajya sabha members, telangana news, telangana latest news, telangana headlines.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *