నిబద్ధతకు దక్కిన గౌరవం- రాజ్యసభకు సంతోష్ | trs rajya sabha candidates…

0
59

జోగినపల్లి సంతోష్ కుమార్ బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా టీఆర్ఎస్ శ్రేణులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. టీఆర్ఎస్ అధినేక కేసీఆర్ వెన్నింటి ఉంటే సంతోష్ ఆయనకు అన్నీతానై వ్యవహరిస్తారు. కార్యకర్తలకు, నాయకులకు అధినేతకు సంధాన కర్తగా ఉండే జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమీప బంధువే కాదు అత్యంత సన్నిహితుడు ఆప్తుడు. పార్టీలో చురుకైన కార్యకర్తగా అశర్నిశం పార్టీకోసం పాటుపడే జోగినిపల్లి సంతోష్ కుమార్ ను రాజ్యసభకు పంపడం ద్వారా నమ్ముకున్న వారిని కేసీఆర్ ఎన్నడూ మర్చిపోడనే విషయం మరోసారి రుజువయింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సంతోష్ కుమార్ ది. సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్నా ఎప్పుడూ ఆయన వ్యవహార శైలిలో మార్పులేదు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగానే పేరు సంపాదించుకున్నాడు.
ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుగు వచ్చే వ్యక్తిగా సంతోష్ కు పార్టీలో గుర్తింపు ఉంది. తెలంగాణ ఉధ్యమసమయంలో ఆయన పాత్ర తక్కువేమీ కాదు. కార్యకర్తలను సమన్వయపర్చకోవడంతో పాటుగా వివిధ సంఘాల నాయకులతో నిత్యం టచ్ లో ఉంటూ ఉధ్యమాన్ని వెనకనుండి నడిపించిన వ్యక్తుల్లో సంతోష్ ఒకరు. టీఆర్ఎస్ పార్టీనే శ్వాసగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యాసగా సంతోష్ పనిచేశారు. అందుకే ఆయన్ను రాజ్యసభకు కేసీఆర్ ఎంపికచేశారు.
జాతీయ రాజకీయాల్లో కీలక పార్త పోషించేందుకు కేసీఆర్ సన్నద్దం అవుతున్న సందర్భంగా సంతోష్ కుమార్ సేవలు ఢిల్లీలో పార్టీకి ఉపయోగపడతాయని భావించిన కేసీఆర్ ఆయన్ను రాజ్యసభకు పంపుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన సంతోష్ ను పలువురు అభినందనలతో ముంచెత్తారు. పలువురు ఎమ్మెల్యేలు సంతోష్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంతోష్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు చెప్పారు.

joginapalli santosh, telangana, telangana news, telangana headlines, trs,kcr,telangana rashtra samithi.trs rajya sabha candidates.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here