లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ…

0
45

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని సాధించిన టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తచాటేందుకు సమాయత్తం అవుతోంది. తెలంగాణలోకి 17 లోక్ సభ సీట్లకు గాను హైదరాబాద్ మినహా 16 సీట్లను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా పార్టీ అధినాకత్వం వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలను చావుదెబ్బకొట్టిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అనంతరం కూడా తన జోరును కొనసాగించింది. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను 9 మంది ఇప్పటికే టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యే సైతం సైకిల్ ను వదిలి కారెక్కుతున్న నేపధ్యంలో విపక్షాల బలం అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా తగ్గిపోయింది.
హైదరాబాద్ కోల్ సభ స్థానం మిత్రపక్షం ఎం.ఐ.ఎం కు వదిలిపెట్టి రాష్ట్రంలోని మిగిలిన లోక్ సభ స్థానాలన్నింటినీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. కారు, సర్కారు, 16 అనేనినాదంతో ఆ పార్టీ ముందుకు వెళ్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అప్పగించి వారిపై పెద్ద బాధ్యతలను కేసీఆర్ ఉంచారు. అభ్యర్థుల ఎంపికలో సైతం ఎమ్మెల్యేల మాటకు విలువనివ్వడంతో అభ్యర్థులను గెలిపించే బాధ్యత వారిపై పడింది.
16 సీట్లకు గాను ఏకంగా 9 మంది కొత్త అభ్యర్థులను టీఆర్ఎస్ రంగంలోకి దింపింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను ఆ పార్టీ పక్కన పెట్టింది. సర్వేలతో పాటుగా పార్టీకి విధేయంగా ఉండేవారినే కేసీఆర్ ఎంపికచేసినట్టు కనిపిస్తోంది. నల్కొండ లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ నుండి ఎంపీగా గెల్చి తరువాత టీఆర్ఎస్ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీకి ఆశక్తి చూపకపోవడంతో అతని స్థానంలో ఆర్థికంగా బలంగా ఉన్న వేంరెడ్డి నరేందర్ రెడ్డిని టీఆర్ఎస్ రంగంలోకి దింపింది. ఇక్కడి నుండి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. మల్కాజ్ గిరీ, సికింద్రాబాద్ స్థానాల నుండి టీఆర్ఎస్ మంత్రులు మల్లారెడ్డి అల్లుడు, మరో మంత్రి తలసాని కుమారుడిని రంగంలోకి దింపింది. చేవేళ్ల స్థానం నుండి డాక్టర్ గడ్డం రంజిక్ కుమార్ పోటీచేస్తున్నారు. టీడీపీ నుండి పార్టీలోకి వచ్చిన రోజే నామా నాగేశ్వరరావు ఖమ్మం టికెట్టుకును దక్కించుకోగా అదే తరహాలో పెద్ద పల్లి నుండి బోర్లకుంట వెంకటేశ్ నేతకానని టీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీనీ పక్కనపెట్టి మరీ నామా వైపే పార్టీ అధిష్టానం మొగ్గుచూపగా పెద్ద పల్లిలో వివేక్ లాంటి నేతకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. మహబూబ్ నగర్ లో సైతం సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిని పక్కకునెట్టి మన్నె శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మహబూబాబాద్ లో సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ స్థానంలో మాలోతు కవిత పోటీ చేస్తున్నారు.
గెల్చిన ఎమ్మెల్యేలను సైతం నిలుపుకోలేక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ టీఆర్ఎస్ కు ఎంతవరకు ఎదురు నిలవగలుగుతుందనేద ప్రశ్నర్థకమే. లోక్ సభకు జరుగుతున్న ఎన్నికలు రాహుల్-మోడీల మధ్యే నంటూ ఆ పార్టీ చేస్తున్న ప్రచారం ఆ పార్టీకి ఎంతవరకు లాభిస్తుందో చూడాలి. టీఆర్ఎస్ గెలిచినా ప్రయోజన లేదని కేంద్ర స్థాయిలో ఆ పార్టీ చేసేదేమేలేదని కాంగ్రెస్ ప్రాచారం చేయడంతో పాటుగా టీఆర్ఎస్ గెల్చినా మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్తోంది.
ఇటు బీజేపీ కూడా కనీసం లోక్ సభ ఎన్నికల లోనైనా పరువు దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటుకే పరిమితం అయిన బీజేపీ ఈ ఎన్నికల్లో మోడీ ఛరిష్మానే నమ్ముకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మోడీ సర్కారును తిరిగి అధికారంలోకి తీసుకుని రావాలంటూ గట్టిగానే ప్రచారం చేస్తోంది.
వివిధ కారణాలు, సమికరణాల నేపధ్యంలో 16 స్థానాల్లో 9 మంది కొత్త వారిని బరిలోకి దింపిన టీఆర్ఎస్ పార్టీ అన్ని స్తానాలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలో తిరిగులేని శక్తిగా ఉండేందుకు ఆ పార్టీ కసరత్తులు చేస్తోంది. కొన్ని చోట్ల అసంతృప్తులు ఉన్నా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి తమకు ఉందని పార్టీ అధినాకత్వం స్పష్టం చేస్తోంది. కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా లేదా అన్నది తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే….

Wanna Share it with loved ones?