అంబేధ్కర్ కు ఘన నివాళి

భారత రాజ్యంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా దిల్ షుఖ్ నగర్ పి అండ్ టి కాలనీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన టీఆర్ఎస్ నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలోని పేదల బతుకులు బాగుపడినప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని టీఆర్ఎస్ సీనియర్ నేత పీచర వేంకటేశ్వర రావు అన్నారు. అంబేధ్కర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. దళితులు, బడుగు, బలహీన వర్గాల వారికోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంభేమ కార్యక్రమాలను అమలు చేస్తోందనన్నారు. దేశంలోనే మరే రాష్ట్రంలోనూ లేని విధంగా అన్ని వర్గాల వారికోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను రొపొందించిన ఘనత రాష్ట్ర ప్రబుత్వానిదే అన్నారు.
సమాజంలో అంతరాలను రూపుమాపే విధంగా అంబేధ్కర్ పూర్తితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని మాజీ కౌౌన్సిలర్, టీఆర్ఎస్ నేత కందికంటి ప్రేమ్ నాథ్ గౌడ్ అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించిన ఆయన ఎస్.సి.,ఎస్.టి లతో పాటుగా బీసీల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. అన్ని వర్గాల అభ్యన్నతే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ వెనుకబడిన వర్గాల వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత కోరుతున్న సమాజం త్వరలోనే బంగారు తెలంగాణలో కనిపిస్తుందని ప్రేమ్ నాథ్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో రైలు తో నగర రూపురేఖలే మారిపోయాయని దిల్ షుఖ్ నగర్ కు రూట్ ను కూడా వీలైనంత త్వరలోనే ప్రారంభించాలని ఆయన కోరారు.
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లక్ష్మణ్, శ్రీకాంత్, నిరంజన్, విజయ్, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *