ప్రత్యక్ష రాజకీయాల్లోకి టీన్యూస్ ఎండీ సంతోష్?

ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఆయన్ను నిత్యం అంటిపెట్టుకుని ఉండే  జోగినపల్లి  సంతోష్ కుమార్ గురించి టీఆర్ఎస్ పార్టీలోనూ, ప్రభుత్వ వర్గాల్లోనూ  తెలియని వారుండరు. ఎప్పుడూ తెరవెనుక ఉండే సంతోష్  ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లోని అత్యంత విశ్వననీయ వర్గాల కథనం ప్రకారం కేసీఆర్ కు సన్నిహింతగా ఉండే ఆయన సమీప బంధువు సంతోష్ రానున్న ఎన్నికల్లోపోటీ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం  తెలంగాణ  న్యూస్ ఛానల్ ఎండీ గా ఉన్న సంతోష్ వేములవాడ అసెంబ్లీ స్థానం పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సిహెచ్ రమేష్  అటు పౌరసత్వ సమస్యలు ఎదుర్కోవడంతో పాటుగా ఆయన ఆరోగ్యం కూడా సరిగాలేదని ఈ కారణంగా సంతోష్ వేములవాడ నుండి పోటీచేస్తారని అంటున్నారు. టీఆర్ఎస్ నేతలందరితోనూ చనువుగా ఉండే సంతోష్ కుమార్ అందరితోనూ సత్సంబంధాలున్నాయి. ఉన్నత విద్యావంతుడు అయిన సంతోష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు చాలా కాలంనుండే కోరుతున్నారు. అన్ని అంశాల్లోనూ చురుగ్గా వ్యవహరించే ఆయన  ఇప్పటివరకు తెరవెనుకనే ఉండిపోయిన సంతోష్ ను తెరముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ లో మొదటి నుండి కీలక పాత్రపోషించిన సంతోష్ అన్ని సందర్భాల్లో కేసీఆర్ వెంటే ఉంటూ వచ్చారు. కేసీఆర్ కు సమీప బంధువు అయిన సంతోష్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. రానున్న ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమని తెలుస్తోంది.

రానున్న ఎన్నికల్లో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.  ప్రస్తుతం ఎంపీగా ఉన్న బాల్క సుమన్ ను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుమన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమచారం. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంతో అత్యంత చురుగ్గా ఉండే సుమన్ సేవనలను రాష్ట్రానికి మరింత ఉపయోగించుకోవడం కోసం ఆయన్ను చొప్పదండి నియోజకవర్గం నుండి పోటీచేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ నుండి ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వెళ్లి టీఆర్ఎస్ గూటికి చేరుకున్న వివేక్ కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అటు పెద్ద పల్లి అసెంబ్లీ స్తానం నుండి కేటీఆర్ పోటీచేస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నుండి మరో ప్రముఖ నేత పోటీ చేస్తారని అంటున్నారు.

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఎదురులేదు. విపక్షాలు అధికారం కోసం ఆలోచించే స్థితిలో కూడా లేవు. అయినా రానున్న ఎన్నికలపై దృష్టిపెట్టిన టీఆర్ఎస్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తెలంగాణ సర్కారు ఎక్కడా అలసత్వానికి తావులేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా ప్రజల నాడిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత జాగురురతతో వ్యవహరిస్తోంది. మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేల పనితీరును బేరూజు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే పలువుర్ని హెచ్చరికలు జారీ చేశారు. అట్టడుగు స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసిన కేసీఆర్ వారని పనితీరును మెరుగుపర్చుకోవాల్సిందిగా సూచించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ రానున్న ఎన్నికల్లో సీట్ల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎం చెప్పినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యేలలో కొంత మంది సీట్లు గల్లంతు కావడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 20 నుండి 25 మందికి టికెట్లు దక్కడం అనుమానం అనే వార్తలు వస్తున్నాయి.  కొంత మంది ఎమ్మెల్యేలకు కార్పేరోషన్ పదవులు ఇచ్చి బుజ్జగింటే అవకాశాలున్నాయి.

టీఆర్ఎస్ అంతర్గత సమాచారం మేరకు కొంత మంది ఎమ్మెల్యేల పనీతీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. నిత్యం వివాదాల్లో ఇరుక్కోవడంతో పాటుగా పనితీరు సరిగా లేని వారిని పక్కనపెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా కొంత మందిని నాయకుల సేవలను మరింత ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

Photo courtesy: T news

Releated

కాచిగూడలో రెండు రైళ్లు ఢీ..

హైదరాబాద్‌లోని కాచిగూడలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. సిగ్నల్ చూసుకోకుండా.. ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్..మరొక ఇంటర్‌ సిటీ ట్రైన్ రెండు రైళ్లు ఢీ కొన్నాయి. దీంతో రెండు బోగీలు పక్కకు ఒరిగాయి. అటు నుంచి.. ఇటు నుంచి.. వచ్చే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకేసారి అక్కడి ప్రయాణికులు […]

TRS leader N. Srinivas Rao

A TRS leader kidnapped?

TRS leader was allegedly kidnapped from his house. His wife said that her husband, a TRS leader was kidnapped by some unknown persons. A TRS leader has been “taken away” by suspected Maoists from his house in Bhadradri-Kothagudem district to the neighbouring Chhattisgarh, police said on Tuesday. N Srinivas Rao, a local Telangana Rashtra Samithi […]