తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి విరాళం 13.5 కోట్లు

తిరుమల శ్రీనివాసుడికి అమెరికా భక్తుడు ఒకరు భారీ విరాళాన్ని ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు గాను ఆ భక్తుడు 13.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు. అంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీనివాస్ అనే శ్రీవారి భక్తుడు అమెరికాలో స్థిరపడ్డారు. స్వామివారికి ఆపార భక్తుడైన శ్రీనివాస్ తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ భారీ మొత్తాన్ని టీటీడీకి అందచేశారు.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి సమక్షంలో దాత శ్రీనివాస్ ఈ భారీ మొత్తానికి సంబంధించిన చెక్కులను టీటీడీ బోర్డు ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కు అందచేశారు. దాతను టీటీడీ అధికారులు ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. తిరుమల శ్రీనివాసుడికి సామాన్యూడి నుండి మాన్యూల దాకా పెద్ద మొత్తంలో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఓకేసారి ఓ భక్తుడు స్వామివారి విరాళం అందచేయలేదని తెలుస్తోంది.
శ్రీనివాసుడికి పెద్ద మొత్తంలోనే విరాళాలు అందుతుంటాయి. చాలా మంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, ధనవంతులు శ్రీనివాసుడికి పెద్ద మొత్తంలో కానుకలు చెల్లించుకుంటారు. వీరిలో కొంతమంది తమపేరును వెల్లడించడానికి ఇష్టపడని వారుకూడా ఉంటారు. ఏక మొత్తంలో 13.5 కోట్ల రూపాయలను స్వామివారికి ఇచ్చిన సందర్భంగా గతంలో లేవని టీటీడీ అధికారులు చెప్తున్నారు.
tirumala, tirumala tirupathi, ttd, venkateshwara swami, tirumala tirupathi devastanam, balaji.

అబద్దపు ప్రచారాలు చేస్తే జైలుకేనా…?


ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి కమ్యూనిస్టు ఛానళ్లు
ttd board