తిరుమల దారి లో తుపాకీ | gun found in tirumala path way

తిరుమల మెట్లదారిలో దొరికిన తుపాకి కలకలం రేపుతోంది. శ్రీవారి మెట్టు వద్ద తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు జరిపిన సోదాలో ఈ తుపాకి బయటపడింది. అధికారులు స్వాధీనం చేసుకున్న తిపాకీని ఎయిర్ గన్ గా గుర్తించారు. తూటాలతో పాటుగా తుపాకీ బయటపడడంతో అటు పోలీసులు ఇటు టీటీడీ ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. తిరుమల దారి లో దొరికిన తుపాకీకి సంబంధించిన వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన ముందు తిరుమల మెట్లదారిలో తుపాకీ దొరకడం మరింత సంచలనంగా మారింది. ఈ ఘటన తరువాత తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలకు తుపాకీ పొరపాటును తీసుకుని వచ్చారా.. ఉద్దేశపూర్వకంగా తీసుకుని వచ్చారా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల దర్శనం టికెట్లు
ttd board

tirumala,tirumala tirupathi,


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *