ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆ పార్టీ తమ అభ్యర్థులుగా సీఎం రమేష్, కె.రవీంద్ర కుమార్ లను ఎంపికచేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది. టీడీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనేక ఉత్కంఠను రేపింది. తొలుత సీఎం రమేష్ తో పాటుగా వర్ల రామయ్య పేరును ఖరారు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపుగా అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వర్లరామయ్య కుటుంబ సభ్యలతో సహా సీఎం చంద్రబాబు నివాసానికి కూడా చేరుకున్న సమయంలో హఠాత్తుగా పార్టీలో పరిస్థితులు మారాయి. వర్ల రామయ్య కు బదులుగా కనకమేడక రవీంద్ర కుమార్ ను ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాల నుండి వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఖరారు చేస్తూ టీడీపీ వర్లరామయ్య స్థానంలో కనకమేడల రవీంద్ర కుమార్ ను రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయించింది.
telugudesam party, telugu desam rajyasabha,telugudesam rajyasabha candidate,c.m.ramesh, varla ramaiah,kanaka medala ravindra kumar, chandrababu,chandrababu naidu, andhra pradesh, andhra pradesh assembly.