టీడీపీ జాతీయవిధానం ఏంటి?

జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ విధానం ఏంటి. దీనిపై ఆ పార్టీలో ఓ మోస్తరు నాయకులు కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అధికారికంగా టీడీపీ ఎన్డీఏ లోనే ఉన్నప్పటికీ బీజేపీతో సంబంధాలు బెడిసిన తరువాత కేంద్ర మంత్రివర్గం నుండి టీడీపీ మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గం నుండి బీజేపీ మంత్రులు బయటికి వచ్చారు. ఇప్పుడు ఇరు పార్టీల మధ్య సంబంధాలు ఉప్ప నిప్పుగా మారాయి. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర స్థాయిలో ఏ కూటమితో కలిసి ముందుకు వెళ్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికైతే టీడీపీ తటస్తంగానే ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపించినా రానున్న రోజుల్లో ఎవరితో జట్టుకట్టే అవకాశలున్నాయనేదానిపై అటు పార్టీ లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.
ఎన్డీఏలోనే కొనసాగినా నిత్యం ఆ కూటమిలో పెద్దన్న బీజేపీని విమర్శిస్తూ ఆ కూటమిలో కొనసాగడంపై రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే విధనాన్ని కొనసాగించాలనే తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్టు అంతర్గత సమాచారం. ఎన్డీఏకు ప్రధాన ప్రత్యర్థి యూపీఏలో చేరే అవకాశం ఎంత మాత్రం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఈ కూటమికి చంద్రబాబు చాలా దూరంగానే ఉంటారు. ఇక మిలిగింది మూడో కూటమి. దీనిపై ఇప్పుడే కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఈ కూటమి పురుడు పోసుకుంది లేదు. మూడో ప్రత్యామ్నాయానికి నాయకత్వం వహించడానికి సిద్ధమంటూ కూటమి ప్రతిపాదని చేసిన కేసీఆర్ తో కలిసి చంద్రబాబు అడుగులు వేస్తారా అనేదే ప్రధాన ప్రశ్న.
తెలంగాణలో టీఆర్ఎస్ తో జట్టుకట్టి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో తెలుగుదేశం కూడా కేసీఆర్ ప్రతిపాదించిన మూడో కూటమిలో చేరే అవకాశాలు లేకపోలేదు. పాత మిత్రులు కమ్యూనిస్టులతో కలిసి పనిచేసేందుకు చంద్రబాబు సిడవచ్చనే వార్తలు వస్తున్నప్పటికీ రాజకీయంగా మూడో కూటమి ఎంతవరకు సఫలం అవుతుందనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.
ఎన్నికల వరకు మౌనంగా ఉండి ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ బీజేపీతో దోస్తీ చేస్తుందని ఆ పార్టీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బీజేపీకి దూరమవడం, ఆ పార్టీ పై విమర్శలు అంతా నాటకమని ఆంధ్రప్రదేశ్ లో ప్రజల వ్యతిరేకతను కేంద్రంపై నెట్టివేసి తన పబ్బం గడుపుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తుగడే తప్ప వాస్తవానికి బీజేపీకి దూరం కావాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదనే ప్రచారం జరుగుతుంది. ఏదిఏమైన తెలుగుదేశం పార్టీ జాతీయ విధానంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.
telugudesam, tdp, telugudesam party, chandrababu naidu, nara chandra babu naidu, telugu, telugug states, kcr, telangana, narendra modi, general elections, tdp leaders, telugudesam party leaders, special status, special status for andhra pradesh.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *