మాట్లాడితే చాలు.. ఇక తెలుగులో టైప్ అయిపోతుంది!

0
11

కంప్యూటర్, మొబైలలో ద్వారా భారీ మొత్తంలో తెలుగులో టైప్ చేసే వారికి ఇంతకన్నా పెద్ద శుభవార్త ఉండదు.
ఇంతకాలం కేవలం ఇంగ్లీష్, ఇతర ప్రపంచ భాషలకే లభించిన వాయిస్ టైపింగ్ ఇప్పుడు తెలుగుకి కూడా వచ్చేసింది. అంటే ఇక కష్టపడి అక్షరాలు వెదుక్కుని ఓపికగా తెలుగు టైపింగ్ చేయాల్సిన పనిలేదు. మీ మీ ఫోన్ లేదా కంప్యూటర్ లో ఓ చిన్న మైక్ ఐకాన్‌‌ని ట్యాప్ చేసి మీరేం టైప్ చెయ్యదలుచుకున్నారో అది మాట్లాడుకుంటూ పోతే చాలు.. వెంటనే స్క్రీన్ మీద అక్షరాలుగా అది వచ్చేస్తుంది.
గూగుల్ సంస్థ తాజాగా ఆండ్రాయిడ్ కోసం జీ బోర్డ్ లో కీ బోర్డ్ యాప్ లో ఈ సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది. దాంతో పాటు గూగుల్లో ట్రాన్స్ లేట్, గూగుల్ సెర్చ్ లలో కూడా ఇది లభిస్తోంది. దశల వారీగా ఇతర అన్ని గూగుల్ సర్వీసులతో పాటు.. స్విఫ్ట్ కీ వంటి థర్డ్-పార్టీ యాప్స్ ద్వారా కూడా ఇది లభించబోతోంది.
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, మలయాళం వంటి ఇతర భారతీయ భాషలకూ ఈ వాయిస్ టైపింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలోనే హిందీలో ఈ సదుపాయం వాడుకలోకి వచ్చేసింది.
తెలుగు పదాలను స్పష్టంగా మాట్లాడినప్పుడు ఇది కచ్చితంగా గుర్తిస్తోంది. కానీ ఆంగ్ల పదాలను మాట్లాడినప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది పడుతోంది.
మీ ఫోన్లో గూగుల్ అప్లికేషను ఓపెన్ చేసి వాయిస్ సెట్టింగులలో తెలుగుని ఎంపిక చేసుకుంటే, తరువాత ఇన్ బిల్ట్ గా ఉండే జీ బోర్డ్ ఆండ్రాయిడ్ కీ బోర్డ్ ను సెలెక్ట్ చేసుకుంటే ఇకపై మీకు నచ్చినట్లు ఎక్కడైనా సులభంగా తెలుగులో టైప్ చేసుకోవచ్చు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here