విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి లేదా?

విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి ఉందా లేదా? అని నేటి తరం వారి ప్రశ్న తెలుగు భాష మాతృభాష ప్రతీ విద్యార్థికీ పరిచయమే.కానీ పాఠశాల విద్యలో వారిపై ఉక్కుపాద మోపి బలవంతంగా తెలుగు మాట్లాడనీయకుండా చేసే పైశాచికత్వం మనకి కనిపిస్తోంది. స్వేచ్ఛలేని విద్యార్థి తప్పనిసరి పరిస్థితుల్లో తన తల్లి బాషను మర్చిపోవాల్సి వస్తోంది. కానీ లోలోపన అంతరాల్లో వారి ఆశక్తి వారి ఆటపాటల్లో వెలికి వస్తూనే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదృష్ట వంతులు. వారు స్వేచ్ఛా జీవులు కాబట్టి చక్కగా తమ భావాన్ని వ్యక్తం చేయగలిగే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఆత్మలను పలికించేదే అసలైన భాష అన్నారు సీనారే. అమ్మ ఒడిలో విన్న కమ్మనైన తెలుగు భాష సమాజంలో, పాఠశాలలో సహచరుల మధ్య ఇంకా ఇంకా విస్తృతమై పెరిగి పెద్దవారియిన కొద్దీ అనంతంగా మారాలి కానీ మాట్లాడే సమయం కానీ, భావ ప్రకటనకు సరైన వేదిక కానీ, వినడానికి సభలు కానీ, ఈనాడు లేవు. డిజిటలైజేషన్ పేరుతో నిర్బంధ విద్య. ప్రశ్నలకు సమాధానం విద్య చెప్పింది వినడమే కానీ సందేహాలు తీర్చుకోలేని విద్యా విధానంలో విద్యార్థి సంవత్సర కాలనిర్ణయ పట్టిక పాఠం వెంట పరగులో గురువు నలిగిపోతున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థి, ఆశయం ఉన్న గురువు మధ్య కాలనిర్ణయ పట్టిక అనే అడ్డుగోడగా నిల్చింది. గ్రంధాలయం ఉన్నా పుస్తకాల కొరత. పుస్తకాలు ఉన్నా చదివే తీరికలేని నేటి విద్యార్థి చట్రంలోని ఇరుసులాగా తిరుగుతూ నలిగిపోతున్నాడు. సమయం కేటాయించి సాహిత్యాన్ని అందుబాటులో ఉంచి వారి చిన్న అనుమానాలను తీర్చగలిగిదే వారు భావి తాహితీ మూర్తులు కాగలరు. చెప్పే గురువుకు విషయావగాహనే కాదు విద్యార్థుల్లో అసక్తిని కలిగించగలగాలి. అన్నింటికన్నా ముఖ్యం అంకితబావం కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్ననాడు పెద్ద సమయ్యగా భావించే ఈ భాషాసమస్య నామరూపాలు లేకుండా పోతుంది. కానీ అశ్రద్ద చూపిస్తే మాత్రం అంతరించి పోగలదు తస్మాత్ జాగ్రత్త….
డాక్టర్ బీ.ఎల్.ప్రసూనా
(విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలు. ఖమ్మం జిల్లా)