తెలుగు మహా సభలు ప్రారంభం

ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన వెంకయ్యనాయుడి జ్యోతి ప్రజ్వలనతో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా పలువురు మంత్రులు అధికారులు హాజరయ్యారు. తొలిరోజున ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పేరిణి నృత్యం సభికులను ఆకట్టుకుంది.. సీఎం కేసీఆర్ తన గురువు బ్రహ్మశ్రీ వేలేటి మృత్యుంజయ శర్మ గారికి గురువందనం చేసి ఆయనను శాలువాతో సత్కరించారు.