అమ్మ భాష నేర్చుకుందాం – అందలం ఎక్కుదాం

ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహాసభలు రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుందాం. ఈ మహాసభల ప్రయోజనాలు నాలుగు రోజుల ముచ్చట్ల వ్యవహారం కాకుండా నాలుగు శతాబ్దాల పాటు మాట్లాడు కోవాలని మన ముఖ్యమంత్రి ఆశయం .. ఆ ఆశయంతోనే, మరచిన మన తెలంగాణ సంస్కృతి- సాహిత్యం – పాల్కురి సోమనాధుడు నించి నిన్న మొన్నటి కవుల వరకు నెమరువేసుకోవడం మన కర్తవ్యం .
ఇది అలాఉండగా ,ఈ రాష్ట్రం లో చదివే ప్రతి విద్యార్థి ( 1-12 వ తరగతి వరకు) తెలుగుభాష ను చదువుకోవాలిసిందే అనే ప్రభుత్వ ఆదేశం- అందరు ఆహ్వానించతగింది.
” మా పిల్లలకు తెలుగు రాదు ” అని గర్వంగా చెప్పే తల్లిదండ్రులు, స్కూల్ లో తెలుగు మాట్లాడితే పనిషమెంట్ అనే బడులు ఉన్నంతకాలం సమాజం లో తెలుగు భాష ఎలా బ్రతికి బట్ట కడుతుందో అని కొందరి అనుమానం .
తెలుగు మృత భాష కాదు అమృత భాష అని నిరూపించాలిసిన అవసరం – మన పై ఉంది .
మన పిల్లలకు తెలుగు సులభంగా ఎలా నేర్పించాలో – ఎలా నేర్పించవచ్చో – సోదాహరణం గా వివరిస్తున్నారు ప్రముఖ తెలుగు ఉపాధ్యాయులు వరలక్ష్మి . రండి … తెలుగు నేర్చుకుందాం.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *