తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రహీరోల సమావేశం

తెలుగు చిత్ర పరిశ్రమ లో నెలకొన్న పరిణామాలను గురించి చర్చించేందుకు తెలుగు అగ్రహీరోలు సమావేశమయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఇందుకు వేదిక అయింది. గత కొద్దిరోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతీ రోజు వార్తల్లో నిలుస్తోంది.
సినీ నటుడు చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, నాగ చైతన్య, సుమంత్, మంచు లక్షి లతో పాటుగా పలువురు హాజరయ్యారు. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానప్పటికీ సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వివాదలను గురించి ఇందులో చర్చించినట్టు తెలుస్తోంది. సాధారణంగా సినీ పరిశ్రమకు చెందిన వ్యవహారాలకు దూరంగా ఉంటే మహేష్ బాబు కూడా ఈ సమావేశానికి రావడం విశేషం. అయితే మరో అగ్రనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం ఈ సమావేశానికి రాలేదు.
సినీ నటి శ్రీరెడ్డి లెవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం చినికి చినికి గాలివాన మారింది. ప్రస్తుతం ఈ వ్యహరం కాస్త తెలుగు నాట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. చిత్ర పరిశ్రలోని అంశాలు చివరికి ఏపీ లోని రెండు సామాజిక వర్గాల మద్య విభేదాలు మారింది. పవన్ కళ్యాణ్ తో పాటుగా అతని కుటుంబానికి, మీడియాలోని ఒక వర్గానికి మధ్య యుద్దంగా మారిపోయింది.
తెలుగు చిత్రపరిశ్రమ లోని వర్గ విభేదాలను ఈ వ్యవహారం బట్టబయలు చేసింది. శ్రీరెడ్డికి పరిశ్రమలోని కొంత మంది మద్దతు పలకగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఆమెకు సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో శ్రీరెడ్డి ఏకంగా మా కార్యాలయం ఎదుటు అర్థనగ్నంగా నిరసన తెలపడం సంచలనం రేపింది.
మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ శ్రీరెడ్డిపై విధించిన నిషేధం వివాదాస్పదం అయింది. దీనిపై మానవహక్కుల వేదిక కూడా స్పందించడంతో ఆమెపై విధించిన నిషేధాన్ని మా ఎత్తివేసిన తరువాత ఈ వివాదం మరో రూపం దాల్చింది. పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి విమర్శలు చేయడం, ఈ వ్యవహారంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఉండడంతో వ్యవహారం మరింత ముదిరింది.
ఫిలిం ఛాంబర్ వద్ద పవన్ కళ్యాణ్ నిరసన తెలపడంతో పాటుగా మీడియాపై ఆయన తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన అభిమానులు ఒక వర్గం మీడియాపై యుద్ధమే చేస్తున్నారు. ఇటువంటి సమయంలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
http://www.telanganaheadlines.in/girls/http://www.telanganaheadlines.in/girls/
telugu, telugu film industry, mahesh babu, junior ntr, naga chaitanya, ram charan, chiranjeevi,manchu lakshmi, venkatesh, hero venkatesh, nani, hero nani, sri reddy, actor sri reddy, pawan kalyan, telugu media, telugu media people, tv-9, tv-5, abn, abn andhra joythi, ravi prakash, radha krishna, pawan kalyan vs media, pawan kalyan war on media, film chamber, telugu movie artists.