టెలిగ్రాం యాప్ పై నిషేధం | block Telegram app : russian court

సోషల్ మీడియా దిగ్గజ్జాలో ఒకటైన ‘టెలిగ్రాం’ ను నిషేధిస్తూ రష్యాలోని ఓకోర్టు ఆదేశాలు జారీచేసింది. రష్యాకు చెందిన ‘టెలిగ్రాం’ ను ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. వాట్సాప్ కు పోటీగా భావించే ‘టెలిగ్రాం’ ను వెంటనే బ్లాక్ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేయడంతో ఈ యాప్ ను ఉపయోగిస్తున్నవారితో పాటుగా మీడియా సంస్థ షాక్ కు గురయ్యారు.
రష్యాకు చెందిన మీడియా నియంత్రణ సంస్థ ఫిర్యాదు మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ‘టెలిగ్రాం’ కు చెందిన ఎన్ క్రిప్ట్ కోడ్ ను ఇవ్వడంలో సంస్థ విఫలం కావడంతో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రష్యా అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం ఈ యాప్ ను ఉపయోగించుకుని మార్చుకుంటున్నారి రష్యా దర్యాప్తు సంస్థ ఎఫ్ఎస్ బీ గుర్తించింది. ఈ మేరకు టెలిగ్రాం కు చెందిన ఎన్ క్రిప్ట్ సమాచారంతో పలు కీలక సమాచారాన్ని దర్యాప్తు బృందం అడిగింది.సదరు సమాచారన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో పాటుగా ప్రైవేటు సంభాషణలను, సమాచార మార్పిడిని తాము నియంత్రించలేమని టెలిగ్రాం స్పష్టం చేయడంతో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎఫ్ఎస్ బీ కోర్టును ఆశ్రయించడంతో వెంటనే టెలిగ్రాం కార్యకలాపాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన మానవహ బాంబు పేలుడు ఘటనలో ఈ యాప్ ను ఉపోయగించుకుని సమాచారాన్ని ఉగ్రవాదులు సంభాషించుకున్నట్టు రష్యా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. రష్యాలోని పలు ఉగ్రవాద సంస్థలు యాప్ ను అసాంఘీక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారని కూడా దర్యాప్తు బృందాలు గుర్తించి యాప్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించాలని కోరాయి. దీనికి టెలిగ్రాం నిరాకరించడంతో దానిపై చర్యకు కోర్టును ఆశ్రయించాయి.
టెలిగ్రాం పూర్తిగా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు సహకరించడంలేదని సమాచారాన్ని ఇవ్వడంలో పూర్తిగా విఫలం అయిందని దర్యాప్తు సంస్థల తరపున వాదించిన లాయర్ చెప్పగా దర్యాప్తు సంస్థలు కోరుతున్న సమాచారం ఇవ్వడం ఏరకంగానూ సాధ్యం కాదని టెలిగ్రాం సంస్థ న్యాయవాది స్పష్టం చేశాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను ఇవ్వడం సాంకేతికంగానూ, న్యాయపరంగానూ ఇవ్వడం సాధ్యంకాదని తేల్చేయడంతో కోర్టు దిగ్గజ సామాజిక మాధ్యమాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రష్యాలోని సాధారణ ప్రజానికంతో పాటుగా ఆదేశ అధికారులు కూడా ఈ యాప్ ను సమాచార మార్పిడి కోసం వినియోగించుకుంటున్నారు. రష్యాతో పాటుగా మధ్యప్రాచ్యంలోనూ టెలిగ్రాంకు మంచి ఆదరణ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20కోట్ల మంది దాకా టెలిగ్రాం యాప్ ను ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఇందులో 5వేల మందిదాకా ఓకే గ్రూప్ గా ఏర్పడి సమాచార మార్పిడి చేసుకునే సౌకర్యం ఉంది.
గతంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు కూడా ఈ యాప్ ను ఉపోయగించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వారికి సంబంధించిన అనేక గ్రూప్ లను గుర్తించిన సంస్థ వాటిని మూసివేసింది. రష్యా కోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
telegram, telegram app, what app
సమాచారం

Instant_messaging
Online_chat
Communication
Organization
International_organizationWhatsApp