తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది:కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో బహుముఖాభివృద్ది జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందుతోందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ది విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని దీనికోసం ఆత్మ బలిదానాలు చేసిన వారికి నివాళి అర్పిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు.
రైతుల శ్రేయస్సుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పాస్ బుక్ ల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటుగా పంటలు పండించుకునేందుకు రైతన్నలకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణానే అన్నారు. రైతులకు కరెంటు కష్టాలు లేకండా చేశామని రాష్ట్రంలో 24 గంటలకు కరెంటు అందుబాటులో ఉందన్నారు. గతంలో ఎరువురు, విత్తనాల కోసం రైతులు పడిన అగచాట్లు అందరికీ గుర్తుతున్నాయని ఇప్పుడు అటువంటి సమస్యలు ఏవీ లేకుండానే రైతులకు ఎరువులు, విత్తనాలు అందుతున్నాయని చెప్పారు. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా సాగునీటి కష్టాలు తీరుస్తున్నామన్నారు. రూపాయి కూడా తీసుకోకుండా రైతులకు ఉచితంగా 5లక్షల భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు సీఎం వివరించారు.నీటి తీరువా, ట్రాక్టర్లపై వాహన పన్ను రద్దు చేశామన్నారు. భూముల వివరాలు పారదర్శకంగా ఉండే ధరణి వెబ్‌సైట్‌ రూపొందించామని సీఎం చెప్పారు.
ప్రజల సాగునీటి అవసరాలు తీర్చిన తెలంగాణ ప్రభుత్వం త్రాగునీటిపై దృష్టి పెట్టిందని ప్రతీ ఇంటికీ మంచినీటి సరఫరా కోసం యుద్దప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. నీళ్ల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. గ్రామీణ, పట్టణాల్లోని పేదలకోసం గృహాలను నిర్మించి ఇస్తున్నామన్నారు. చాలీచాలని గదులు కాకుండా రెండు బెడ్ రూంలతో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నామని వెళ్లడించారు. ప్రతీ ఆస్పత్రిలోనూ కనీస సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా ఆధునిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు అధికం కావడమే ఇందుకు నిదర్శనమని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు జరిగిన ప్రతీ వారికీ కేసీఆర్ కిట్ ను అందిస్తున్నామని ఇది బాలింతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును స్వయంగా రాష్ట్ర గవర్నర్ మెచ్చుకోవడంతో పాటుగా ఆయన స్వయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు, శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.రాష్ట్రంలో అనేకమంది కంటి సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని ఈ సమస్యలనుండి వారిని దూరం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు కేసీఆర్ పేర్కొన్నారు.
షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలతో పాటుగా మహిళలకు, యువతకు స్వయం ఉపాధి పథకాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు సీఎం వివరించారు. పారిశ్రామిక రగంలో రాష్ట్రం శరవేగంతో దూసుకుని పోతోందని అతి తక్కువ సమయంలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే ఆగ్రగామిగా నిలుతామని కేసీఆర్ పేర్కొన్నారు.
telangana, telangana formation day, telangana cm kcr, cm kcr, kalvakuntla chandrasekhar rao, telangana government, telangana state.

ఉత్తర్ ప్రదేశ్ లో ఏంజరుగుతోంది-బీజేపీ కలవరంTelangana