రాజ్యసభకు జోగినపల్లి సంతోష్ సహా ముగ్గిరి ఎన్నిక

0
48

తెలంగాణ నుండి ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులు రాజ్యసభకు ఎంపికయ్యారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు, బడుగుల లింగయ్య, బండ ప్రకాశ్ లు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన బలరాం నాయక్ ఓటమి చెందారు.
టీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోగినపల్లి సంతోష్ కుమార్ కు 32 ఓట్లు రాగా, బడుగుల లింగయ్యకు 32, బండ ప్రకాశ్ కు 33 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాం నాయక్ కు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ ఏజెంటుకు చూసి ఓటు వేయడంతో ఆయన ఓటు చెల్లకుండా పోయింది.
దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ ఏజెంట్ కు చూపిన తరువాత ఓటు వేశారని ఎన్నికల అధికారి చేసిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో గెల్చి టీఆర్ఎస్ పంచన చేసిన వారు విప్ ను దిక్కరించారని వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. దీనిపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో 119 మంది సభ్యులు ఉండగా 108 మంది మాత్రమే ఓటు వేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే బీజేపీ, టీడీపీ, సీపీఎం పార్టీలు ఓటింగ్ లో పాల్గొనలేదు. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని అసెంబ్లీ రద్దు చేయడంతో శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లు ఓటు వేసే అవకాశం కోల్పోయారు.
రాజ్యసభకు ఎంపికైన టీఆర్ఎస్ సభ్యులను పార్టీ ఎమ్మెల్యేలు అభినందించారు. ముఖ్యంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితు సంతోష్ రాజ్యసభకు ఎంపికవడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు.
జోగినపల్లి సంతోష్ కుమార్ బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా టీఆర్ఎస్ శ్రేణులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. టీఆర్ఎస్ అధినేక కేసీఆర్ వెన్నింటి ఉంటే సంతోష్ ఆయనకు అన్నీతానై వ్యవహరిస్తారు. కార్యకర్తలకు, నాయకులకు అధినేతకు సంధాన కర్తగా ఉండే జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమీప బంధువే కాదు అత్యంత సన్నిహితుడు ఆప్తుడు. పార్టీలో చురుకైన కార్యకర్తగా అశర్నిశం పార్టీకోసం పాటుపడే జోగినిపల్లి సంతోష్ కుమార్ ను రాజ్యసభకు పంపడం ద్వారా నమ్ముకున్న వారిని కేసీఆర్ ఎన్నడూ మర్చిపోడనే విషయం మరోసారి రుజువయింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సంతోష్ కుమార్ ది. సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్నా ఎప్పుడూ ఆయన వ్యవహార శైలిలో మార్పులేదు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగానే పేరు సంపాదించుకున్నాడు.
ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుగు వచ్చే వ్యక్తిగా సంతోష్ కు పార్టీలో గుర్తింపు ఉంది. తెలంగాణ ఉధ్యమసమయంలో ఆయన పాత్ర తక్కువేమీ కాదు. కార్యకర్తలను సమన్వయపర్చకోవడంతో పాటుగా వివిధ సంఘాల నాయకులతో నిత్యం టచ్ లో ఉంటూ ఉధ్యమాన్ని వెనకనుండి నడిపించిన వ్యక్తుల్లో సంతోష్ ఒకరు. టీఆర్ఎస్ పార్టీనే శ్వాసగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యాసగా సంతోష్ పనిచేశారు. మూడు స్థానాలకు కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
joginapali santosh kumar, santosh kumar, trs santosh, trs santosh kumar, santosh elected to rajya sabha, rajya sabha santosh, telangana, telangana assmebly, telangana assembly sessions, rajya sabha elections, balaram naiak, congress, congress party, telangana congress party.

Wanna Share it with loved ones?