కొండెక్కిన మామిడి రు.100 కి ఒక కాయ | rs.100 for one mango

మామిడికాయ వంద రూపాయలు ఇదేదో అమెరికాలోనో, ఆష్ట్రేలియాలోనో కాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పరిస్థితి. చిన్న రెమ్మ వాప పూత రు.20 పలుకుతుండగా నాలుగు మామిడి ఆకులను రు.10కి అమ్ముతున్నారు. మిగతావాటి ధరల సంగతి ఎట్లా ఉన్నా మామిడికాయల ధరలు మాత్రం ఈ దఫా గణనీయంగా పెరిగిపోయాయి.
ఉగాది పచ్చడిలో వేసుకునే పదార్థాల్లో ముఖ్యమైన వాటిల్లో మామిడికాయ ఒకటి. ఈ సంవత్సరం మామిడికాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. చిన్న కాయ రు.50 పలుకుతుందడగా ఓ మోస్తరు కాయధర వందరూపాయలకు చేరింది. మామిడి కాయలు ఇంకా రాకపోవడంతో కాసిన అరకొరకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనితో మామిడికాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంత ధర పెట్టి మామిడి కాయలు కొనే పరిస్థితి లేదని వినియోగదారులు వాపోతున్నారు. కనీసం ఒక్క కాయ కొందామన్నా కాయధర వందరూపాయనేసరి గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి వచ్చిందని మార్కెట్ కు వచ్చిన ఒక మహిళ వాపోయంది.
తాము చేసేది ఏమీలేదని ఈ దఫా మామిడి కాయలు మార్కెట్ లోకి రాలేదని వ్యాపారులు చెప్తున్నారు. చాలా చోట్ల ఇంకా పూతదశలోనే ఉందని కాయలు కాయలేదని కొన్ని చోట్ల కాయలు కాసినా ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొనుగోలుదారుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు.
mango, green mango, ugadi, ugadi mango, mango for ugadi pachadi, mango market, vegetable market, mango market, rs 100 for one mango, mangos rates, mango season, mango fruit,


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *