తెలంగాణ జనసమితి పార్టీ సత్తా చాటేనా?| telangana janasamithi party

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రాజకీయ పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ (టీజేఎస్పీ) ఎంవరకు నిలదొక్కుకోగలదనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తెలంగాణ పొల్టికల్ జేఏసీ ఉధ్యమ సమయంలో ఎంత కీలకంగా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. ఆటు తరువాత జేఏసీలో తలెత్తిన విభేదాల కారణంగా దాని ప్రభ క్రమంగా మసకబారుతూ వచ్చింది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగిన జేఏసీ ఛైర్మన్ కోదండరాం క్రమంగా కేసీఆర్ కు దూరం అవుతూ వచ్చారు. టీఆర్ఎస్ తో ఉధ్యమసమయంలో కలిసిపనిచేసిన ప్రజాసంఘాలకు చెందిన నేతలు కూడా టీఆర్ఎస్ తో పాటుగా కేసీఆర్ కూ దారంగా జరిగారు.
తెలంగాణ ప్రభుత్వంపై తొలిదశలో పెద్దగా విమర్శలు చేయని తెలంగాణ జేఏసీ తన స్వరాన్ని పెంచింది. ఇప్పుడు కోదండరాంకు, కేసీఆర్ కు మధ్య ఉప్పు నిప్పుగా తయారయింది. ఈ పరిస్థితుల్లో కోదండరాం నేతృత్వంలో పురుగుడు పోసుకున్న తెలంగాణ జనసమితి తెలంగాణలో తాము నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతామని చెప్తోంది.
తమను తక్కువగా అంచానావేయవద్దని ఆ పార్టీ నాయుకులు చెప్తున్నారు. చిన్న గా ప్రారంభం అయిన రాజకీయ పార్టీలు కూడా ఆ తరువాత ప్రబల శక్తిగా ఎదిగిన వైనాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఒకప్పుడు సైకిల్ పై ఊరూరా తిరిగిన కాన్సీరాం ఉత్తర్ ప్రదేశ్ లో ఎటువంటి ప్రభావతం చూపారే గుర్తుపెట్టుకోవాలని వారంటున్నారు. ఆమ్ ఆద్మీపార్టీ విజయాన్ని కూడా వారు గుర్తుచేస్తున్నారు.
ఉద్యమకారులు కలలు కన్న తెలంగాణ సాధిస్తాం
తెలంగాణ కోసం ఏంతో మంది బలిదానాలు చేశారని అయితే వారి ఆకాంక్షలకు విరుద్దంగా తెలంగాణలో పాలన సాగుతోందనేది తెలంగాణ జనసమితి పార్టీ ఆరోపణ. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు దోపిడీ వర్గాలకు దగ్గరయిందని వారు విమర్శిస్తున్నారు. తెలంగాణలో పాలన పూర్తిగా నిరంకుశంగా తయారయిందని గతంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన దొరల సంస్కృతి నేడు పాలక వర్గాల్లో కనిపిస్తోందని వారు దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ కు వ్యతిరేకిస్తున్న శక్తులు ఇప్పుడు టీజేఎస్పీకి దగ్గరవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కోవాడం అంత ఆషామాషీ కాదన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న ఛరిష్మాకు ధీటుగా ప్రజల్లోఉన్న నాయుకుడు ఎవరూ టీజేఎస్పీ వెంటలేరనే సంగతిని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనే సంగతిని కూడా గుర్తుంచుకోవాలని వారు చెప్తున్నారు. బలమైన నాయకులతో పాటుగా గ్రామాల్లో పటిష్టమైన కార్యకర్తల బలంతో ఉన్న టీఆర్ఎస్ ఢీకొట్టడం సులువేం కాదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నయంగా ఎదిగే సత్తా తెలంగాణ జనసమితి పార్టీ కి ఉందా అంటే లేదనే చెప్పక తప్పదు.
గ్రామగ్రామానా కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోలేక పోతోంది. ఇటు తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీ ఆశలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కోదండరాం నేతృత్వంలో ఆవిర్భవించిన కొత్త పార్టీ ఎంతవరకు సత్తా చాటుతుందో వేచి చూడాల్సిందే…
telangana janasamithi party, tjsp, kodandaram, prof kodandaram, new political party, new political party in telangana, telangana, telangana state, telangana headlines, telangana news, telangana latest news, telangana cm, kcr, trs, telangana rastra samithi.

తెలంగాణ ఉధ్యమం
1969 telangana movement
trs
kcr
kalvakuntla kavitha
kareemnagar
telangana