తెలంగాణ కు కాగ్ అక్షింతలు | cag blames telangana

0
85
తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు

తెలంగాణ రాష్ట్రానికి కంట్రోల్ అండ్ ఆడిటర్ జర్నల్ (కాగ్) అక్షింతలు వేసింది. ఆర్థిక నియంత్రణ సరిగాలేదని పద్దతులను పాటించడం లేదని కాగ్ తన నివేదికలో మండిపడింది. వివిధ పథకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరుపుతున్నప్పటికీ వాటిని సరిగా ఖర్చుచేయడం లేదని కాగ్ మండిపడింది.
ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, మున్సిపాలిటీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘాల కోసం కేటాయిస్తున్న నిధులు సక్రమంగా ఖర్చు చేయడం లేదని కాగ్ చెప్తోంది. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల వ్యయానికి చట్టబద్దత ఉన్నప్పటికీ నిధులు కనీసం సగానికంటే తక్కువగా ఖర్చుచేశారని కాగ్ చెప్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూలోటును లెవెన్యు మిగులుగా చూపిస్తోందని కాగ్ తన నివేదికలు స్పష్టం చేసంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 5392 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా దాన్ని 1386 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులుగా చూపించారని కాగ్ చెప్తోంది. సరైన పద్దతిలో పద్దులను నిర్వహించకపోవడం వల్లే ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని కాగ్ పేర్కొంది.
విద్యా, వైద్య రంగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు కాగ్ వెల్లడించింది. విద్యా హక్కు చట్టం ఉన్నప్పటికీ బడిమానేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని ముఖ్యంగా బాలికలు చదువులకు దూరం అవుతున్నారని కాగ్ నివేదిక వెల్లడించింది. అటు ఆరోగ్య రంగంలోని నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చు చేయడంలేదని కాగ్ వెలుగులోకి తెచ్చింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నిధులు సక్రమంగా ఖర్చుచేయడం లేదని చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో సీజేరియన్ ల సంఖ్య ఎక్కువగా ఉందని ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని కాగ్ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి వ్యయంలో మాత్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి వ్యయం 19.70 ఉండగా తెలంగాణలో అది 28.22 గా ఉంది. దీని వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయని కాగ్ తన నివేదికలో పేర్గొంది.
control and audit general (cag) blames government for over stating its revenue. reports that telangana state is physical deficit, not with in the norms of FRBM act sofa. telangana,telangana state, telangana budget,telangana,control and audit general, cag.
తెలంగాణలో కొత్త పురపాలికలు

Wanna Share it with loved ones?