ఇంతలోనే ఎంత మార్పు-డోలాయమానంలో బీజేపీ

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంది. అడపాదడపా చిన్న పాటి విమర్శలు తప్ప టీడీపీపై బీజేపీ నేతలు ఏనాడు చెప్పుకోదగ్గ స్థాయిలో విమర్శలు చేసింది లేదు. ప్రభుత్వం ఏర్పాడిన తొలినాళ్లలో అయితే రెండుపార్టీలు చెట్టాపట్లాలేసుకుని తిరిగాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పైకి మిత్రపక్షలాగునే చెప్పుకుంటున్నా రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం-బీజేపీ పార్టీలు అధికారికంగా మిత్రపక్షాలుగా కలిసే ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం విడిపోయినట్టుగానే ప్రవర్తిస్తున్నాయి. ఒకరికి ఒకరి అవసరం కనుక రెండు పార్టీలు ఆపాటి కొద్ది బంధాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకనాడు చెప్పాపట్టాలు వేసుకుని తిరిగిన ఇరుపార్టీల నేతలు నేతలు నేడు కత్తులు దూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం నామమాత్రమే అన్న సంగతి తెలిసిందే. కొంత మంది పెద్ద నేతలు పార్టీలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పెద్గా బలం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం మీదనే నెట్టుకొచ్చిన బీజేపీ ప్రధానిగా మోడికి ఉన్న ఛరిష్మాను ఉపోయగించుకుని రాష్ట్రంలో ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఇక తెలంగాణలోనూ బీజేపీ-టీఆర్ఎస్ ల మధ్య మంచి సంబంధాలే కొనసాగాయి. అధికారికంగా ఎటువంటి పొత్తు లేకున్నా ఒక రకంగా టీఆర్ఎస్ మిత్రపక్షంగానే వ్యవహరించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ, రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి బాసటగా నిల్చారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేసినా జాతీయ స్థాయి నేతలు మాత్రం కేసీఆర్ ను పెద్దగా విమర్శించలేదు. పలువురు కేంద్ర మంత్రులు కేసీఆర్ చేపట్టిన పథకాలపై ప్రశంశల జల్లు కురిపించారు కూడా. ఇటు కేసీఆర్ కూడా ప్రధాని మోడిని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత బలంగానే ఉండింది. టీఆర్ఎస్ ఎంపి, కేసీఆర్ కుమారై కవిత కేంద్ర మంత్రి వర్గంలో చేరతాయనే ఊహాగానాలు కూడా వచ్చాయి.
తెలంగాణ లోనూ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ప్రధాని మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వాతావరణాన్ని మరింత వెడెక్కించాయి.జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయానికి బాటలు వేస్తున్న కేసీఆర్ కేంద్రంపై పదునైనా వ్యాఖ్యలనే చేశారు. మోడి తనకు మంత్రి మిత్రుడని చెప్తునే కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. దీనితో తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దుమ్మెతి పోసుకుంటున్నారు. సంస్థాగతంలో ఏపీ కంటే బీజేపీ తెలంగాణలో కాస్త బలంగానే ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ను ఎదుర్కొనే స్థాయిలో మాత్రం లేదు.
రెండు రాష్ట్రాల్లో మిత్ర పక్షం, అనుకూల పక్షం హోదాను అనుభవించిన బీజేపీ పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు రావడంతో ఆ పార్టీకి అగ్నిపరీక్షగానే మారింది. ప్రభుత్వాల విధానాలపై ఎటువంటి పోరాటం లేకుండా కొంత నిర్లిప్తంగా కార్యకర్తల్లో తిరిగి ఉత్సాహం నింపేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ కార్యకర్తల్లో ఆ స్థాయి స్పందన కనిపించడం లేదు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *