ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి,సంపత్ లపై వేటు-11 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్

సోమవారం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యతాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ వ్యవహారల శాఖ మంత్రి హరీష్ రావు ప్రతిపాదించగా సభ ఈ తీర్మానాన్ని ఆమెదించింది. దీనితో ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసే వీలుగా సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ చట్టం ప్రకారం సభలో ఈ తీర్మానాన్ని హరీష్ రావు ప్రతిపాదించారు. దీనితో పాటుగా జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటుగా 11 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో జానారెడ్డి, జీవన్ రెడ్డి, మాధవరెడ్డి, మల్లు బట్టివిక్రమార్క,గీతారెడ్డి,చిన్నారెడ్డి,డీకే అరుణ,పద్మావతి, వంశీచందర్ రెడ్డి, రామ్ మోహన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.
సభ ప్రారంభం అయిన వెంటనే సోమవారం జరిగిన ఘటనపై స్పీకర్ మదుసూధనాచారి విచారం వ్యక్తం చేశారు.
అటు శాసనమండలి లోనూ కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో షబ్బీర్ అలీ.. పొంగులేటి.సుధాకర్ రెడ్డి.. .సంతోష్ ..దామోదర్ రెడ్డి ఆకుల లలిత..కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లు ఉన్నారు.
telangana, telangana assembly, trs, kcr, harish rao, komatireddy venkat reddy, sampath, telangana assembly.