ప్రస్తుతానికి కేంద్రంతో 'రాజీ' నే

0
61

కేంద్ర ప్రభుత్వం పై దూకుడు పెంచిన తెలుగుదేశం పార్టీ అంతలోనే వెనక్కి తగ్గింది. బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్నాన్ని నిర్వహించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ గొంతును పార్లమెంటులో గట్టిగా వినిపించాలని ఆదేశించారు. పార్టీ ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ టీడీపీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్టుగా చెప్పారు.
అయితే అంతలోనే సీన్ మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఫోన్లు రావడంతో పాటుగా కొంతమంది మద్యవర్థులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెగతెంబుల వరకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కేంద్రంతో ఘర్షణ పడడం అంతమంచిదికాదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనితో ప్రస్తుతానికి వేచిచూసే ధోరణిలోనే ఉండాలని తెలుగుదేశం పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది.Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here