ముగిసిన టీడీపీ-బీజేపీల బంధం

బీజేపీ తో పొత్తుకు టీడీపీ రాంరాం చెప్పింది. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న తమ ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనితో టీడీపీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేయనున్నారు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేసినా తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏలో కొనసాగుతుంది. అయితే ఆ బంధం కూడా త్వరలోనే ముగిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో పోరాటానికి ఎంతకైనా తెగిస్తామని చెప్తువస్తున్న తెలుగుదేశం పార్టీ బుధవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణు జైట్లీ ఢిల్లీలో ప్రకటించిన తరువాత టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా కోసం తము పోరాడుతున్నామని మరే ఇతర ప్రత్యామ్నాయాలను అంగీకరించే పరిస్థితి లేదని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. కేంద్రం తమని మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ను మోసం చేస్తోందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ ను అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర రక్షణ బడ్జెట్ ను కూడా తమకు కేటాయించాలని ఏపీ అడుగుతుందంటూ చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *