నెయ్యమా..కయ్యమా… సందిగ్ధంలో టీడీపీ

0
73

బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన విషయంపై రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. దీనితో అధికార టీడీపీ తీవ్ర ఒత్తిడిగి లోనవుతోంది. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏటూ తేల్చని పక్షంలో తమ ఏంపీలు రాజీనామా చేస్తారంటూ వైసీపీఅధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన తరువాత వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతల ప్రకటనలు సాగుతున్నప్పటికీ వీటిలో కూడా స్పష్టత ఉండటం లేదు. ప్రజానీకం నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడితో టీడీపీ తడబాటుకు గురవుతోందా అన్న సందేహం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.
చంద్రబాబునాయుడు ప్యాకేజికి, హోదాకు ఉన్న తేడా ఏమిటో చెప్పాలని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి పదవులు ముఖ్యం కాదన్న ఆయన, జగన్‌ మాదిరి తనపై కేసులు లేవని, కేంద్రానికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ, బీజేపీతో పొత్తుపెట్టుకుంటుందంటూ వచ్చిన వార్తను ఆయన చదివి వినిపించారు. అయితే. కేంద్ర ప్రభుత్వానికి మార్చి 5వ తేదే డెడ్‌లైన్‌ అన్నట్లుగా పలువురు టీడీపీ నేతలు చేసిన ప్రకటనలను ఆయన ప్రస్తావించలేదు. టీడీపీ నేతల ప్రకటనకు చంద్రబాబు ప్రకటనకు ఎక్కడా పొంతలేకుండా పోయింది.
అదే సమయంలో ఏలూరులో మాట్లాడిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్చి5న చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పాదయాత్రకు జనం రాకపోవడంతోనే జగన్‌ రాజీనామాల డ్రామాను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడిన హోంశాఖ మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప కూడా మార్చి 5వ తేదిన అనూహ్య నిర్ణయం ఉంటుందని చెప్పారు.రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మార్చి 5వ తేదిలోగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటామని, అదే రోజు తమ పార్టీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని, చంద్రబాబునాయుడు ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రకటించారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మాట్లాడిన టీడీపీ నాయకులు కూడా ఇదే విధంగా స్పందించారు. టీడీపీ ఎంఎల్‌సి వైవిబి రాజేంద్రప్రసాద్‌ ఆదినారాయణరెడ్డి ఆవేశంలో మాట్లాడారని, అటువంటి నిర్ణయమేమి తీసుకోలేదని తేల్చివేశారు. ఆ తరువాత కాసేపటికే మళ్లీ మీడియా ముందుకు వచ్చిన ఆదినారాయణరెడ్డి ఐదవ తేది తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారన్నది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నారు. తన ప్రకటనకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వివరించారు.
కేంద్ర ప్రభుత్వంతో అనుసరించాల్సి వ్యూహంపై తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సందిగ్ధతతో విపక్ష వైసీపీ మరింత రెచ్చిపోతోంది. రాజీనామాల్లో తమతో కలిసి రావాలని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. వైసీపీ ఎంపీలతో కలిసి టీడీపీ ఎంపీిలు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి చెందిన ఎంపిలందరూ రాజీనామా చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదని ఆయన ప్రశ్నించారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here